IT returns: కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఐటీ రిటర్నులు దాఖలు అక్కర్లేదు.. మినహాయింపు ఎవరెవరికంటే..?
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 75 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు ఆదాయపన్నులు చెల్లింపులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
IT Returns for Senior Citizens: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదాయపన్నులు చెల్లింపులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 75 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, ఐటీ రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచే ఇది వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన వెసులుబాటును పొందేందుకు అవసరమైన వాంగ్మూల పత్రాలను ఐటీ విభాగం నోటిఫై చేసింది.
75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ‘పింఛను ఆదాయం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ ఒకే బ్యాంకు నుంచి పొందుతుంటే’ వారు 2021 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ మేరకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తాజాగా నిబంధనలతో సహా డిక్లరేషన్ ఫామ్‌లను నోటిఫై చేసింది. వీటిని సంబంధిత బ్యాంకుల్లో సమర్పిస్తే మూలం వద్ద పన్ను కోతను (టీడీఎస్) ఆ బ్యాంకులు నిలిపివేస్తాయని తెలిపింది. అయితే, పింఛను డిపాజిట్ అయ్యే బ్యాంకులోనే వడ్డీ ఆదాయం కూడా ఉంటేనే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు లభిస్తుందని ఐటీ విభాగం వెల్లడించింది.
Inter Admissions: ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. ప్రభుత్వానికి కీలక సూచనలు