Corona-Wedding: కరోనా తెచ్చిన తంటా… అమెరికాలో సంప్రదాయంగా పెళ్లి, ఆన్‌లైన్‌లో వీక్షించి ఆంధ్ర నుంచి తల్లిదండ్రులు ఆశీస్సులు
Corona-Wedding: కరోనా వైరస్ వలన జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. అంతేకాదు.. కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితుల మధ్య ఎంతో వైభవంగా జరుపుకునే పెళ్లిళ్లలో కూడా మార్పులు వచ్చాయి..
Corona-Wedding: కరోనా వైరస్ వలన జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. అంతేకాదు.. కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితుల మధ్య ఎంతో వైభవంగా జరుపుకునే పెళ్లిళ్లలో కూడా మార్పులు వచ్చాయి. పెళ్లి కూతురు, పెల్లుకొడుకు.. ఇరు కుటుంబాల్లోని ముఖ్యమైన బంధువుల సమక్షంలో పెళ్లిళ్లు జారుకునే రోజులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంకొంచెం అడుగు ముందు వేసి.. తమ పిల్లలు.. విదేశాల్లో వివాహం చేసుకుంటే.. ఇక్కడ మన దేశంలో ఉండి ఆ పెళ్లిళ్లను సినిమాలు చూసినట్లు.. తెరపై చూస్తూ.. వారిని ఆశీర్వదించే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వధూవరులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. అక్కడ నుంచి తమ పెళ్ళికి భారత దేశానికి రావడానికి లేకపోవడంతో… అమెరికాలోనే పెళ్లి చేసుకున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉండి ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన వరుడు గ్రీష్మంత్ కు ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన వధువు అనుజ్ఞ వృత్తి రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి రెండు సంవత్సరాల క్రితం వివాహం కొరకు పెద్దలు నిశ్చయతాంబులాలు తీసుకున్నారు. అయితే వధూవరులిద్దరూ వృత్తి రీత్యా అమెరికా లో ఉంటున్నారు. వివాహం చేసుకోవాలని రెండు సంవత్సరాలనుంచి చూస్తున్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. థర్డ్ వేవ్ కరోనా నేపథ్యంలో అబ్బాయి, అమ్మాయి భారత్ కు వచ్చే పరిస్థితులు లేకపోయాయి. దీంతో ఇద్దరును తమ తల్లిదండ్రుల ఆశీస్సులు ఆన్ లైన్ లో తీసుకుని అనుకున్న ముహుర్తానికి ఆమెరికాలోని డల్లాస్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహనికి హజరు కాలేని కుటుంబ సభ్యులు, బంధువులు విన్నూత తరహాలో పెళ్లి వేడుకలను తిలకించేందుకు పట్టణంలోని జయకృష్ణ అపార్ట్ మెంట్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి వివాహ వేడుకలు తిలకించి నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. ప్రస్తుతం ఈ వినూత్న సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది.
Also Read: కేరళలో నిఫా వైరస్.. అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్..