AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ.. మరికాసేపట్లో కేంద్ర జల్‌శక్తి మంత్రితో భేటీ..!

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. మరికొద్ది సేపట్లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీను కలుస్తారాయన. రాత్రి 7గంటలకు జలశక్తి శాఖ మంత్రితో భేటీ..

CM KCR: హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ.. మరికాసేపట్లో కేంద్ర జల్‌శక్తి మంత్రితో భేటీ..!
Kcr
Balaraju Goud
|

Updated on: Sep 06, 2021 | 4:45 PM

Share

CM KCR Delhi Tour: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. మరికొద్ది సేపట్లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీను కలుస్తారాయన. రాత్రి 7గంటలకు జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ తో భేటీ కానున్నారు. ఆ సమావేశం కీలకంగా చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం.. కేంద్ర గెజిట్‌పై గజేంద్ర సింగ్‌తో చర్చించనున్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ఐదు రోజులుగా హస్తినలోనే ఉన్నారు. రాష్ట్రానికి సంబందించి వివిధ అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇవాళ మరోసారి మరికొందరు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా మరి కాసేపట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌ను కలుసుకోనున్నారు.

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్రసింగ్ షెకావ‌త్ భేటీతో పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల యాజన్య బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేష‌న్ పై తెలంగాణ అభ్యంత‌రాల‌ను సీఎం కేసీఆర్‌.. మంత్రి దృష్టికి తీసుకురానున్నారు. కృష్ణా జ‌లాల్లో 50 శాతం వాటా కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్న తెలంగాణ సర్కార్.. ఈ సందర్భంగా తమ వాదనను గట్టిగానే నివేదించనున్నారు. అలాగే, కృష్ణా నదీపై అనుమ‌తిలేని ఏపీ ప్రాజెక్టుల‌పై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఫిర్యాదు చేయ‌నున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా బేసిన్ అవ‌త‌ల ఉన్న ప్రాంతాల‌కు నీటిని త‌ర‌లించ‌డంపై మొదటినుంచి అభ్యంతరం చెబుతున్న తెలంగాణ.. ఈ విషయంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయ‌నున్నారు కేసీఆర్. శ్రీ‌శైలం నుంచి హంద్రీనీవాకు అక్రమంగా త‌ర‌లిస్తున్న నీటిని నివారించాలని మంత్రిని కోరనున్నారు. బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ప్రకారం శ్రీ‌శైలం జ‌ల‌విద్యుత్ కోసం కట్టిన ప్రాజెక్ట్ అని తెలంగాణ వాద‌ను గట్టిగానే వినిపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, బీడు వారిన తెలంగాణ‌ భూములను సస్యశ్యామలం చేయడంలో భాగంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూత‌న ప్రాజెక్టులకు అనుమ‌తులు ఇవ్వాలని సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కోరనున్నారు.

అలాగే, ప్రస్తుతం కృష్ణా జ‌లాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ‌కు 299 టీఎంసీల‌తో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలు, సాగు సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో కొత్తగా వాటాల పంపిణీ జరపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి భేటీలో సీఎం కేసీఆర్ ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు కృష్ణాజలాలను రెండు తెలుగు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. ఈనేపథ్యంలో కేంద్రంపై మరింతగా ఒత్తిడి తీసుకువచ్చేలా సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.

Read Also….  AP Weather Report: ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆయా ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!

వీరమాచినేని సూచించే డైట్ తీస్కోవాలా..? వద్దా..? డైట్ పై డౌట్స్ ఎందుకు..?(వీడియో):Veeramachaneni Vs Indian Medical Association video.