Jeevita Rajasekhar: ఎక్కడ ఏమి జరిగినా చిరు-రాజశేఖర్‌లు అంటారు.. అదంతా గతం అంటున్న జీవితారాజశేఖర్

Jeevita Rajasekhar on Mega Family: 'మా' ఎన్నికలు సాధారణ ఎన్నికల తలపిస్తున్నాయి. రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ఈసారి 'మా' అధ్యక్ష పదవి కోసం ఆరుగురుపైగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో..

Jeevita Rajasekhar: ఎక్కడ ఏమి జరిగినా చిరు-రాజశేఖర్‌లు అంటారు.. అదంతా గతం అంటున్న జీవితారాజశేఖర్
Jivita Chiru
Follow us
Surya Kala

|

Updated on: Sep 06, 2021 | 7:38 PM

Jeevita Rajasekhar on Mega Family: ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికల తలపిస్తున్నాయి. రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఆరుగురుపైగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కు జీవితా రాజశేఖర్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపధ్యంలో జీవితా రాజశేఖర్ స్పందిస్తూ.. మెగా ఫ్యామిలీతో విబేధాలు అనేవి గతమని చెప్పారు.. ఇప్పుడు అవన్నీ సర్దుమణిగాయి. ఒక కుటుంబంలో అనేక గొడవలు వస్తాయి.. మళ్ళీ పోతాయి.. మా మధ్య కూడా ఉన్న విబేధాలు కూడా అటువంటివే నని అన్నారు. ఎవరికీ తగినట్లు వారు మాట్లాడతారు. మెగాస్టార్ చిరంజీవి తో గొడవ మా పిల్లలు ఆరేళ్లు  ఉన్నపుడు జరిగింది.. వాళ్లకు ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చాయి.. ఇప్పుడు మా కుటుంబాల మధ్య ఎటువంటి విబేధాలు లేవు.. ఎక్కడ ఏమి జరిగినా రాజశేఖర్ .. చిరంజీవి అంటూ మాట్లాడతారు. అది సరికాదని అన్నారు.

ఇక మా డైరీ ఆవిష్కరణ సమయంలో కూడా జరిగిన వివాదం చిరంజీవికి రాజశేఖర్ కి మధ్య కాదు జరిగింది.  నరేష్ కి మొత్తం పానెల్ కు ఉన్న విషయంలో రాజశేఖర్ స్పందించారు.  ఎప్పుడు ఏమి జరిగినా రాజశేఖర్ కు చిరంజీవికి మధ్య అంటూ ఆపాదిస్తున్నారు తప్ప.. మా ఫ్యామిలీల మధ్య ఏమి లేదు.. అంత టైం వాళ్ళ ఫ్యామిలీకి లేదు.. మాకు లేదు.. పొద్దున్న లేస్తే.. ఎవరి సమస్యలు వారికే కనిపిస్తాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలని మన లైఫ్ ఎలా లీడ్ చేయాలనే ఆలోచించే సమయం.. ఇక కరోనా వచ్చిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది.. పనిలేని వారు తప్ప.. పని ఉన్నవారు ఎవరూ పాస్ట్ ని అస్తమాను తీసుకొచ్చి మాట్లాడారు అని జీవిత చెప్పారు. అంతేకాదు తనపై బండ్ల గణేశ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని జీవితా రాజశేఖర్ స్పష్టం చేశారు. బండ్ల గణేష్ మాటల్లోని మర్మం తనకు అర్ధం కాలేదని చెప్పారు. అంతేకాదు ‘మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని జీవిత స్పష్టం చేశారు.

Also Read:  వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.. పడవనే స్కూల్‌గా మార్చిన టీచర్స్.. ఎక్కడంటే