Nani Rahul: ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామ ఈడికేంచి’ అంటోన్న నాని.. ట్విట్టర్‌లో ఫన్నీ వార్.
Nani Rahul Ramakrishna: ప్రస్తుతం సెలబ్రిటీలు తమ సినిమాలకు సంబంధించిన విషయాలను నేరుగా సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్...
Nani Rahul Ramakrishna: ప్రస్తుతం సెలబ్రిటీలు తమ సినిమాలకు సంబంధించిన విషయాలను నేరుగా సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో నాని, రాహుల్ రామకృష్ణల మధ్య ట్విట్టర్ వేదికగా ఫన్నీ వార్ జరిగింది. ఇంతకీ విషయమేంటంటే.. నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ చిత్రం ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు రాహుల్ రామకృష్ణ హీరోగా ‘నెట్’ అనే సినిమా జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ క్రమంలోనే రాహుల్ మొదట ట్వీట్ చేస్తూ.. ‘నానికి పెద్ద ఫ్యాన్ ఇక్కడ. అయినప్పటికీ నేను నటిస్తోన్న ‘నెట్’ చిత్రమే బాగుంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు స్పందించిన నాని.. జాతి రత్నాలు సినిమాలో రాహుల్ రామకృష్ణ చెప్పే ఫన్నీ డైలాగ్ ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామ ఈడికేంచి’ అని ఫన్నీ కామెంట్ చేశాడు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. మరి వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోన్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తుందో చూడాలి.
@NameisNani Big big big fan here. But I believe my film has the best to offer on #September10th #NET #ZEE5
— Rahul Ramakrishna (@eyrahul) September 5, 2021
Naa Valle problem ayithey ellipotha mawa idi kenchi 😉#WatchNetonSept10th@eyrahul ? https://t.co/LRvloCMdbU
— Nani (@NameisNani) September 5, 2021
Also Read: Nithin Maestro: నితిన్ ‘మాస్ట్రో’ నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది… ఆకట్టుకుంటోన్న లిరిక్స్.
Childhood Photo: రజనీకాంత్ , శ్రీదేవిలతో నటించిన ఈ బాలుడు ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా