Nithiin Maestro: నితిన్ ‘మాస్ట్రో’ నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది… ఆకట్టుకుంటోన్న లిరిక్స్.
Nithin Maestro: నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'మాస్ట్రో'. నభానటేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని...
Nithiin Maestro: నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘మాస్ట్రో’. నభానటేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘అంధాదున్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ చివరి క్షణం వరకు భావించింది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్‌యంలో థియేటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా సెప్టెంబర్ 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రచారంలో వేగం పెంచిన సినిమా యూనిట్ తాజాగా సినిమాకు సంబంధించి మరో పాటను విడుదల చేసింది. ‘లా లా లా’ అని సాగే ఈ పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్వర సాగర్ మహాతి పాటను పాడిన తీరు బాగుంది. మరి ఈ మెలోడి సాంగ్‌ను మీరూ ఓసారి వినేయండి.
ఇక హిందీ అందాధున్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలకపాత్రలు పోషించారు. 2018లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకుపైగా రాబట్టి బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. మరి తెలుగులోనూ నితిన్ ఆ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Childhood Photo: రజనీకాంత్ , శ్రీదేవిలతో నటించిన ఈ బాలుడు ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా
siri hanumanth Photos: చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..