Bigg Boss 5: ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన రవి.. బిగ్‌బాస్‌లో తీర్చలేని కోరికను ఇన్‌స్టాలో నేరవేర్చాడు. రవి టార్గెట్‌ అదేనా?

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 06, 2021 | 5:33 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ మొదలై ఒక్క రోజు కూడా కాకముందే ఆసక్తిని పెంచేసింది. కంటెస్టెంట్‌ల ఎంపికలో వైవిధ్యతను చూపించిన నిర్వాహకులు ఈసారి కార్యక్రమంపై...

Bigg Boss 5: ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన రవి.. బిగ్‌బాస్‌లో తీర్చలేని కోరికను ఇన్‌స్టాలో నేరవేర్చాడు. రవి టార్గెట్‌ అదేనా?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ మొదలై ఒక్క రోజు కూడా కాకముందే ఆసక్తిని పెంచేసింది. కంటెస్టెంట్‌ల ఎంపికలో వైవిధ్యతను చూపించిన నిర్వాహకులు ఈసారి కార్యక్రమంపై భారీగా అంచనాలు పెంచేశారు. ఈ సీజన్‌లో పాల్గొంటోన్న వారిలో యాంకర్‌ రవి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న రవికి బిగ్‌బాస్‌లోనూ మంచి క్రేజ్‌ దక్కే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే రవి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లిన కొద్ది గంటలకే ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను రవి అడ్మిన్ పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం రవి అకౌంట్‌లో పోస్ట్‌ అయిన వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇంతకీ విషయమేంటంటే.. రవి బిగ్‌బాస్‌కు ఎంపికై క్వారంటైన్‌లో ఉన్న సమయంలో, రవి బిగ్‌బాస్‌ షో ఎంట్రీ ఇచ్చే సమయంలో అల్లు అర్జున్‌ సరైనోడు టైటిల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే రవి మాత్రం ‘మారి’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం ముందుగానే తెలిసిన రవి క్వారంటైన్‌లో ఉన్న సమయంలోనే బన్నీ సరైనోడు టైటిల్‌ పాటకు డ్యాన్స్‌ చేశాడు. తాజాగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రవి అడ్మిన్‌ పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో రవి మాట్లాడుతూ.. ‘మీ అందరినీ ఈ వీడియోతో హ్యాపీ చేద్దామని ఫిక్స్‌ అయ్యానని చెబుతూ.. సరైనోడు సాంగ్‌తో ఎంట్రీ ఇస్తున్నట్లు వచ్చిన వార్తలతో ఎవరూ నిరుత్సాహ పడకూడదనే ఉద్దేశంతోనే డ్యాన్స్‌ చేస్తున్నాను’ అంటూ సరైనోడు పాటకు స్టెప్పులేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవి చేసిన ఈ డ్యాన్స్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా అభిమానులను ఆట్రాక్ట్‌ చేయడం కోసమే రవి ఇలా ఈ పాటకు స్టెప్పులు వేశాడా.? అన్న చర్చ జరుగుతోంది. మరి రవి బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఏమేర రాణిస్తాడో చూడాలి.

Also Read: siri hanumanth Photos: చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Suma Kanakala: చీరకట్టులో మెరిసిన తెలుగింటి ఆడపడుచు.. వైరలవుతున్న యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటోలు..

Bigg Boss 5: ‘అరే ఏంట్రా ఇది’.. హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. యాంకర్ రవి, షణ్ముఖ్‌‌లే టార్గెట్.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu