Positive Story: వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.. పడవనే స్కూల్‌గా మార్చిన టీచర్స్.. ఎక్కడంటే

Surya Kala

Surya Kala |

Updated on: Sep 06, 2021 | 7:11 PM

Positive Story: కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు.. అంబరాన్ని అందుకోవచ్చు, సముద్ర లోతుల్ని కొలవచ్చు.. పర్వతాలు అధిరోహించవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా..

Positive Story: వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.. పడవనే స్కూల్‌గా మార్చిన టీచర్స్.. ఎక్కడంటే
Floods

Follow us on

Positive Story: కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు.. అంబరాన్ని అందుకోవచ్చు, సముద్ర లోతుల్ని కొలవచ్చు.. పర్వతాలు అధిరోహించవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా అడ్డంకులు ఎదురైనా.. వాటిని అధిగమించి.. తాను చేయాలనుకున్న మంచిపనిని చేయవచ్చు. అయితే వీటిని సాధించాలంటే కావాల్సింది పట్టుదల.. ఎవరేమనుకున్నా లెక్కచేయని కార్యదీక్ష.. దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాడు ఓ ఉపాద్యాయుడు.. అసలే కరోనా నేపథ్యంలో అంతంతమాత్రంగా సాగుతున్న చదువులు… ఇప్పుడు వర్షాలు, వరదలతో ఆ చదువులు సాగడం మరింత కష్టతరంగా మారాయి. దీంతో ఓ టీచర్ వినూత్నంగా ఆలోచించాడు.. తన మెదడుకి పదును పెట్టి. వరదనీటినే తనకు అనుకూలంగా మార్చుకుని విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేసేందుకు రెడీ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..

బీహార్​లోని కతిహార్​​ జిల్లా వరద ముంపు ప్రాంతం. ఇక్కడ ఆరునెలల పాటు వరద నీరు నిలిచే ఉంది. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఎంతగా అంటే.. ఎవరైనా మరణిస్తే.. వారికి అంత్యక్రియలను నిర్వహించడానికి కనీసం పొడి ప్లేస్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక విద్యార్థుల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే కరోనా కారణంగా మూతబడిన స్కూల్స్ .. ఇక కొద్దోగొప్పో ఇంటిదగ్గర చదువుకుంటూ.. విద్యార్థులు కష్టపడుతున్న సమయంలో వరదల రూపంలో మరిన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవన్నీ పంకజ్, రవీంద్ర అనే ఇద్దరు ఉపాధ్యాయులు గమనించారు. ఎలాగైనా స్టూడెంట్స్ కు చదువుకునే పరిస్థితులను ఏర్పరచాలని భావించారు. విద్యార్థులకు  పడవల్లోనే బోధన ప్రారంభించారు. ఉచితంగా విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి ‘నావ్ కీ పాఠశాల’ అని పేరు పెట్టారు.

పడవలో చదువు చెప్పడం మొదలు పెట్టినప్పుడు ముగ్గురు-నలుగురు విద్యార్థులు మాత్రమే వచ్చేవారని.. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిందని ఉపాధ్యాయుడు పంకజ్ చెప్పారు. అందుకని ఇప్పుడు విద్యార్థులు పడవలో కూర్చుకోవడానికి స్థలం సరిపోవడం లేదన్నారు. ఇక్కడి పిల్లలు నీటికి భయపడరు. వారికి అలవాటు అయింది. పరీక్షలు సమీపిస్తున్నాయి.. అయితే ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

మాకు పడవతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇందులో చదువుకోవడం ఏం భయంగా లేదు. నేను బాగా చదుకుని సైన్యంలో చేరాలనుకుంటున్నా. అందుకే చదువుకోవాలంటూ ఓ స్టూడెంట్ చెప్పాడు. నడుము లోతు వరద ఉన్నప్పటికీ భావితరాల భవిష్యత్ కోసం అలోచించి.. విద్యార్థులకు విద్యను అందించాలనే ఉపాధ్యాయుల సంకల్పం గొప్పదని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:  ఖైరతాబాద్‌లో మొదలైన వినాయక చవితి సందడి.. గణపయ్యతో సెల్ఫీలు తీసుకుంటున్న భక్తులు..  భాగ్యనగరానికి భారీ వర్ష సూచన.. రెడ్ అలెర్ట్ జారీ.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరిన అధికారులు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu