Hyderabad Rains Alert: భాగ్యనగరానికి భారీ వర్ష సూచన.. రెడ్ అలెర్ట్ జారీ.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరిన అధికారులు
Hyderabad Rains Alert: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Hyderabad Rains Alert: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం నుంచి విరామం లేకుండా 6 గంటల నుంచి 8 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కోరారు.
తెలంగాణ పక్కనే ఛత్తీస్‌గడ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం, భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వివరించింది. రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనుక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అత్యవసరం ఏర్పడితే సహాయం కోసం 040 – 2955 5500 నంబర్‌ను సంప్రదించాలనిహైదరాబాద్ నగర ప్రజలకు సూచించారు.
Also Read: రజనీకాంత్ , శ్రీదేవిలతో నటించిన ఈ బాలుడు ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..