Vinakaya Chavithi: ఖైరతాబాద్‌లో మొదలైన వినాయక చవితి సందడి.. గణపయ్యతో సెల్ఫీలు తీసుకుంటున్న భక్తులు

Vinakaya Chavithi:భాద్రపద మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ వినాయక చవితి. ఈ పండగను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. పదిరోజుల పాటు వినాయకుడిని ఎంతో భక్తిశ్రద్దలతో..

Vinakaya Chavithi: ఖైరతాబాద్‌లో మొదలైన వినాయక చవితి సందడి.. గణపయ్యతో సెల్ఫీలు తీసుకుంటున్న భక్తులు
Khairatabad Ganesh
Follow us

|

Updated on: Sep 06, 2021 | 6:47 PM

Vinakaya Chavithi:భాద్రపద మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ వినాయక చవితి. ఈ పండగను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. పదిరోజుల పాటు వినాయకుడిని ఎంతో భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఇక దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. కరోనా నిబంధనలను పాటిస్తూ.. విఘ్నేశ్వరుడి ఉత్సవాలను జరపడానికి భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలంగాణాలో ఖైరతాబాద్ లో కొలువుదీరనున్న గణేశుడుకూడా రెడీ అయ్యాడు. ఇక్కడ ఈ సారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా గణేశుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ఉత్సవాలను జరిపేలా ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది 40 అడుగుల గణపతి విగ్రహం ఇప్పటికే తయారయ్యింది.

తెలుగు రాష్ట్రల్లో  గణపతి ఉత్సవాల్లో ప్రత్యేకం స్థానం చోటు సంపాదించుకుంది ఖైరతాబాద్​ గణపతి విగ్రహం. ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఏటా భారీ ఖాయంలో దర్శనమిచ్చే వినాయకుడిపై కరోనా ప్రభావం పడింది. దీంతో గతేడాది నిడారంబరంగా ఉత్సవాలను నిర్వహించారు. 2020లో ఖైరతాబాద్ గణేశుడు ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో దర్శనమిచ్చారు.  కేవలం 9 అడుగుల ప్రతిమను ఉత్సవకమిటీ ప్రతిష్ఠించింది. అయితే కరోనా నేపథ్యంలో దర్శనానికి భక్తులెవరినీ అనుమతించలేదు.

అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగాభక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఉత్సవాలను నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఈసారి భారీగా ఏర్పాట్లు చేస్తోంది.  ఇప్పటికే 40 అడుగుల గణేష విగ్రహం తయారీ పూర్తయింది. దీంతో విగ్రహం ముందున్న కర్రలు తొలగించారు. అటునుంచి వచ్చే భక్తులు.. గణపతి విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

అయితే రాష్ట్రంలో కొవిడ్​ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూనే వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఖైరతాబాద్​ గణేష్​ మండపంతో పాటు నగరంలో ఏర్పాటు చేస్తున్న మండపాల వద్ద కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ గణపయ్యను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Hyderabad Rains Alert: భాగ్యనగరానికి భారీ వర్ష సూచన.. రెడ్ అలెర్ట్ జారీ.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరిన అధికారులు..