వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంటే డబ్బు సమస్యలు వస్తాయి..! అవేంటో తెలుసుకోండి..

Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను

వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంటే డబ్బు సమస్యలు వస్తాయి..! అవేంటో తెలుసుకోండి..
Vastu

Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు. ఇంటిలో లేదా ఆఫీసులో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై కూడా చర్చిస్తారు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో బాగుండాలంటే కొన్ని నియమాలు అవసరం. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. కుటుం సభ్యుల ఆరోగ్యం క్షీణించడం, డబ్బు సమస్యలు, పేదరికం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ 5 వస్తువులను ఎప్పుడు ఇంట్లో ఉంచకూడదు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. చెత్తను ఇంట్లో ఉంచకూడదు..
ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెత్త ఉంటే ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పరిశుభ్రత ఉన్నచోట లక్ష్మి తాండవిస్తుందని పురాణాలలో చెప్పారు. ఎక్కువసేపు ఇంట్లో చెత్తను ఉంచవద్దు. ఎప్పటికప్పుడు తీసివేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

2. ఇంట్లో చీపురును కనిపించకుండా పెట్టాలి..
వాస్తు ప్రకారం చీపురును లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. ఎల్లప్పుడూ చీపురును ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచాలి. అంతేకాకుండా ఎప్పుడు చీపురును నిటారుగా ఉంచవద్దు. సాయంత్రం సమయంలో చీపురుతో ఊడవకూడదు. మీరు ఈ విషయాలను పాటించకపోతే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

3. విరిగిన ఫర్నిచర్
మీ ఇంట్లో విరిగిన ఫర్నిచర్ ఉంటే దానిని వీలైనంత త్వరగా ఇంటి నుంచి తొలగించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. విరిగిన ఫర్నిచర్ వాస్తు దోషాలకు మూలం. ఇది ఇంట్లో ఆర్థిక అడ్డంకులతో పాటు వైవాహిక జీవితంలో సమస్యలను తెస్తుంది.

4. పావురం గూడు
ఇంట్లో పావురం గూడు ఉంటే వెంటనే దాన్ని తీసి వేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో గూడు ఉండటం చెడు సంకేతం. దీని కారణంగా ఇంట్లో గొడవలు మొదలవుతాయి.

5. చెడు గడియారం
వాస్తు శాస్త్రం ప్రకారం చెడిపోయిన గడియారం లేదా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణుల అభిప్రాయం.

Karthik Deepam: నిజాలు తవ్వే పనిలో రోషిణి.. కార్తీక్‌తో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసిన మోనిత!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వేదిక పై మెరిసిన అందం.. ముద్దుగుమ్మ సిరి గురించి మీకు తెలుసా..?

Viral Video: చేపను కాపాడిన కుక్క..! వీడియో చూస్తే ప్రశంసించకుండా ఉండలేరు..

Click on your DTH Provider to Add TV9 Telugu