AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ 4 లక్షణాలు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ మోసం చెయ్యరు.!

Chanakya Niti: ఏ వ్యక్తితోనైనా స్నేహం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఎవరి నైతికతనైనా...

Chanakya Niti: ఈ 4 లక్షణాలు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ మోసం చెయ్యరు.!
Chanakya Niti
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 06, 2021 | 9:43 PM

Share

ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు మాత్రమే కాదు.. నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్ధికవేత్త. ఆయన రాసిన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన సూత్రాలు ఎన్నో ఉంటాయి. అవి పాటించడానికి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ.. మన జీవితాన్ని మంచి మార్గం వైపు నడిపే మార్గదర్శకాలని మర్చిపోవద్దు. చాణక్యుడి సూత్రాలు పాటిస్తే.. ప్రతీ సమస్యకి పరిష్కారం దొరుకుంతుంది.

ఇదిలా ఉంటే.. ఏ వ్యక్తితోనైనా స్నేహం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఎవరి నైతికతనైనా తెలుసుకోగలిగే లక్షణాల గురించి ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికీ మోసం చెయ్యరట. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

ఎదుటివారి కోసం ఆనందాలను వదులుకోవడం..

ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఇతరుల కోసం తన ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తులు ఎప్పటికీ మోసం చెయ్యరు. అలాంటి వ్యక్తులు నిస్వార్ధపరులు. వారిని నమ్మొచ్చు. స్వార్థపరులైన వ్యక్తులు ఎల్లప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

దాతృత్వ స్ఫూర్తి..

దాతృత్వానికి గ్రంథాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దానం చేయడం అంటే డబ్బు మాత్రమే ఇవ్వడం కాదు.. నిజాయితీతో నిష్కల్మషమైన మనసుతో సహాయం చేయడం కూడా. మనసు స్వచ్చంగా, నిజాయితీతో ఉన్నవారు ఎన్నటికీ మోసపోకూడదు. అలాంటి వ్యక్తులతో ఎల్లప్పుడూ స్నేహం చేయండి. వారు మిమ్మల్ని ఎన్నడూ మోసం చెయ్యరు.

ధర్మాన్ని అనుసరించేవారు..

చాణక్యుడి ప్రకారం.. ధర్మం వైపు నడిచే వ్యక్తి ఎలప్పుడూ డబ్బును సంపాదిస్తాడు. అలాంటివారిని ఎలప్పుడూ విశ్వసించవచ్చు. ఎందుకంటే వారు మిమ్మల్ని ఎన్నడూ మోసం చెయ్యరు. అలాంటివారితో స్నేహం చేయొచ్చు.

నిజాలను మాట్లాడేవారు..

ఎప్పుడూ నిజాలు చెప్పేవారు/మాట్లాడేవారిని ఎవ్వరూ మోసం చెయ్యరని ఆచార్య చాణక్యుడు అన్నారు. అదే సమయంలో అబద్దాలు చెప్పేవారికి దూరంగా ఉండాలన్నారు. అలాంటి వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందుల్లో పడేస్తారు.

Also Read: కొండల మధ్య దాగున్న సింహం.. కనిపెట్టండంటూ సవాల్ విసురుతోంది.. గుర్తించండి!

ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?