Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesar Water: రోజూ పరగడుపున గోరువెచ్చటి కుంకుమపువ్వు వాటర్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..

Kesar Water Health Benefits: భారతీయుల వంటల్లో కుంకుమ పువ్వు విరివిగా కనిపిస్తుంది. అంతేకాదు మనదేశంలోని గర్భిణులకు పెద్దలు కుంకుమపువ్వు కలిపిన పాలు ఇస్తారు. ఇలా తాగితే పిల్లలు..

Kesar Water: రోజూ పరగడుపున గోరువెచ్చటి కుంకుమపువ్వు వాటర్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..
Saffron Water
Follow us
Surya Kala

|

Updated on: Sep 06, 2021 | 9:41 PM

Kesar Water Health Benefits: భారతీయుల వంటల్లో కుంకుమ పువ్వు విరివిగా కనిపిస్తుంది. అంతేకాదు మనదేశంలోని గర్భిణులకు పెద్దలు కుంకుమపువ్వు కలిపిన పాలు ఇస్తారు. ఇలా తాగితే పిల్లలు తెల్లగా పుడతారని నమ్మకం. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి.  ఏది ఏమైనా రంగు, రుచి వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు.  అందుకే ఇది అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం.  కుంకుమపువ్వు.. ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం కాశ్మీర్ లో మాత్రమే పండుతుంది. అయితే కుంకుమ పువ్వు స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడనుంచే మిగతా దేశాలకు విస్తరించింది.. అయినప్పటికీ అన్నిటిలోకి కాశ్మీర్ కేసరే నాణ్యమైంది.

ఇది వంట‌ల‌కు చ‌క్కని రుచి, వాస‌న ఇస్తుంది. అయితే కుంకుమ పువ్వులో అనేక ఔష‌ధ విలువలు ఉన్నాయి. అనేక అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. ముఖ్యంగా పురుషులకు కుంకుమపువ్వు మంచి ఔషధం అని ఆయుర్వేద నిపుణులు అంటారు. పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక కుంకుమ పువ్వు నీళ్లను తాగ‌డం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట.. ఈరోజు కేసర్ వాటర్ తయారీ.. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*కుంకుమపువ్వు మంచి సౌందర్య సాధనం. చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది.  చ‌ర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టాక్సిన్లను  బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. కుంకుమ పువ్వు నీళ్లను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం తేమ‌గా, మృద‌వుగా ఉంటుంది. మొటిమ‌లు, మ‌చ్చలు త‌గ్గుతాయి. చ‌ర్మం య‌వ్వనంగా క‌నిపిస్తుంది. అందుకే కాస్మెటిక్ క్రీముల్లోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియాలో గుణాల వల్ల ఇది మొటిమలకు మందులా పనిచేస్తుంది. *యాంటీ ఆక్సిడెంట్ల గుణాలున్న ఈ ఫైటోకెమికల్స్  రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే ఆయుర్వేదంలో కుంకుమ పువ్వును ఎక్కువగా వాడుతుంటారు. *రుతు స్రావం అధికంగా అయ్యే సమయంలో మ‌హిళ‌లు ఈ కుంకుమ పువ్వు నీళ్ల తాగడం వలన ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. హార్మోన్ల స‌మ‌తుల్యం అవుతాయి. నెలసరిని క్రమబద్ధం చేస్తుంది. *జీర్ణశక్తిని పెంచుతుంది. పేగు గోడలకు పూతలా అతుక్కుని ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ డిఫ్రసెంట్ గానూ పనిచేస్తుంది. *ఉద‌యాన్నే కుంకుమ పువ్వు నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఉత్సాహం వ‌స్తుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. *ప్రాచీన రోమన్లు స్నానానికి, జుట్టుకి రంగు వేసుకునేందుకు కూడా దీన్ని ఎక్కువగా వాడేవారు. జుట్టు రాలే స‌మ‌స్య ఉన్నవారికి కుంకుమ పువ్వు మంచి సహాయకారి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తాయి. జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. దీంతో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. *పడుకునే ముందు చిటికెడు కుంకుమపువ్వుని పాలల్లో కలుపుకుని తాగి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. దీంతో డిప్రెషన్ వంటివి కూడా తగ్గుతాయి

కేసర్ వాటర్ తయారీ విధానం: 

ముందుగా 5 నుంచి 7 కుంకుమ పువ్వు పోగుల‌ను తీసుకుని గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. దీంతో కుంకుమ పువ్వు నీళ్లు త‌యార‌వుతాయి. వాటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చగా ఉండ‌గానే తాగేయాలి. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఈ నీరును తాగాల్సి ఉంటుంది. దీంతో మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. అయితే ఎక్కువ కుంకుమ పువ్వు నీటిలో నానబెడితే.. మొదటికే మోసం వస్తుంది. రుచి మారి చేదెక్కుతుంది.

Also Read :  వాహనం కింద పడబోయిన బాలుడు.. రక్షించిన పారిశుధ్య కార్మికుడు.. వీడియో సోషల్ మీడియాలో వైరల్