Corona Medicine: అందుబాటులోకి కోవిడ్ మందు.. టొసిరా డ్రగ్ తయారీకి.. హైదరాబాద్ హెటిరోకు అనుమతి!
కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం టోసిలిజుమాబ్ వారి బయోసిమిలర్ వర్షన్ కోసం డీసీజీఐ అత్యవసర వినియోగ అధికారం లభించినట్లు హైదరాబాదీ ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో ప్రకటించింది.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం టోసిలిజుమాబ్ వారి బయోసిమిలర్ వర్షన్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అత్యవసర వినియోగ అధికారం లభించినట్లు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో సోమవారం ప్రకటించింది. ప్రపంచ ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ సంస్థ ‘టోసిరా’ బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు హెటెరో సంస్థ తెలిపింది.
రొచె హోల్డింగ్ ఏజీ సంస్థకు చెందిన కోవిడ్ ఔషధ జనరిక్ వర్షన్‌ను తయారీ చేసేందుకు అత్యవసర అనుమతి దక్కిందని హెటిరో ఫార్మా పేర్కొంది. రొచె సంస్థకు చెందిన టొసిలిజుమాబ్ ఔషధాన్ని ఇక ఇండియాలో హెటిరో సంస్థ తయారీ చేయనుంది. ఈ నెల చివర నాటికల్లా మన దేశంలో ఈ ఔషధం అందుబాటులోకి రానున్నట్లు హెటిరో వెల్లడించింది. టొసిరా బ్రాండ్ నేమ్‌తో దీన్ని విక్రయించనున్నారు.
కాగా, డెల్టా వేరియంట్ దూకుడుతో ప్రపంచవ్యాప్తంగా టొసిలిజుమాబ్ ఔషధాలకు భారీ డిమాండ్ పెరిగింది. ఆర్థ్రటిస్ డ్రగ్ అయిన టొసిలిజుమాబ్.. కోవిడ్ రోగుల్లో మరణాల సంఖ్య భారీగా తగ్గించింది. ఈ ఔషధం తీసుకున్న వారిలో వెంటిలేటర్ అవసరం లేకుండా చేసింది. దీంతో ఈ ఔషధానికి ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలోను అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కాగా, హైదరాబాద్‌లో ఉన్న హెటిరో యూనిట్‌లో టొసిరా ఔషధాన్ని తయారు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటిచింద. ఇప్పటికే రెమ్‌డిసివిర్, ఫావిపిరావిర్ డ్రగ్స్‌ను కూడా హెటిరో తయారు చేస్తోంది.
Read Also…. Ganesh Chaturthi: సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. గణేష్ ఉత్సవాలతో సహా అన్ని వేడుకలపై ఆంక్షలు