Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona Updates: తెలంగాణలో ఇంకా కనిపిస్తూనే ఉన్న మహమ్మారి జాడ..

తెలంగాణలో కరోనా మహమ్మారి జాడ కనిపిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది.

Telangana Corona Updates: తెలంగాణలో ఇంకా కనిపిస్తూనే ఉన్న మహమ్మారి జాడ..
Telangana Corona
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 06, 2021 | 9:28 PM

Corona Updates: తెలంగాణలో కరోనా మహమ్మారి జాడ కనిపిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు, నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 67,720 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు బయటపడ్డాయి.

Telangana Corona 1.1

ఇక, కరీంనగర్ జిల్లాలో 31, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. వనపర్తి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 339 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,50,453 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,505 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,886కి పెరిగింది.

Telangana Corona 2.2

Read also: Tv9 Big News Big Debate: గణేషుడి ఉత్సవాలపై రాజకీయ నీడ