- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi: How To Make Eco Friendly Ganesh Idols At your home
Vinayaka Chavithi: ఇంట్లోనే బంకమట్టితో వినాయక విగ్రహం సులభంగా తయారీ.. స్టెప్ బై స్టెప్..
Vinayaka Chavithi 2021: వినాయక చవితి పండగ వస్తుందంటే.. ఇంట్లో సందడే సందడి.. ఓ వైపు వినాయక విగ్రహం తయారీ.. మరోవైపు మండపం అలంకరణ ఇలా పిల్లలు పెద్దలు బిజీబిజీగా గడుపుతారు. అయితే పర్యావరణానికి మేలు చేసే విధంగా వినాయక విగ్రహాన్ని మట్టితో తయారు చేసి.. పూజ చేయడం అన్నివిధాలా శ్రేయస్కరం.. కనుక ఈరోజు మీ ఇంట్లోనే మట్టితో సులభంగా గణేశుడి విగ్రహం తయారు చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం..
Updated on: Sep 07, 2021 | 9:41 AM

ముందుగా బంకమట్టి తీసుకొని దానిని కొంచెం నీరు వేసి.. చపాతీ పిండిముద్దలా బాగా కలపండి. అనంతరం దానిని కొన్ని ముక్కులుగా విభజించండి. పైన ఫోటోలో కనిపించిన విధంగా విగ్రహం యొక్క శరీర భాగాలుగా రెడీ చేయండి.

ఇప్పుడు చెవులు, కళ్ళు, చేతిలో ఉండే లడ్డు కోసం చిన్న చిన్న బంకమట్టి ఉండలు చేయండి. వినాయకుడి బాడీకి వాటిని ఫొటోలో చూపించినట్లు అతికించండి.

విగ్రహాన్ని రెడీ చేసిన అనంతరం వెనుక భాగాన్ని బంకమట్టితో కవర్ చేయండి.

తుది మెరుగులు దిద్దుకుని గణపతి విగ్రహానికి నచ్చిన విధంగా దోతీ కట్టి.. అలంకరణ చేయండి.. అంతే ఇకో ఫ్రెండ్లి గణేష్ మండపంలో పెట్టడానికి రెడీ