పుణే నుండి 65 కిమీ దూరంలో కర్హా నది ఒడ్డున మోర్గావ్ గ్రామంలో వినాయక ఆలయం ఉంది. ఇక్కడ గణేశుడు మూషికవాహనంపై కాకుండా నెమలిని ఆసనంగా చేసుకుని ఉంటాడు.. అందుకనే ఈ గణేషుడిని మయూరేశ్వరుడు, మోరేష్, మోరేశ్వర్ అని పిలుస్తారు. గణేశుడి పక్కడ ఆయన భార్యలైన సిద్ధి, బుద్ధి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో వినాయక చవితితోపాటు విజయదశమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.