ముందు స్టౌ మీద దళసరి గిన్నె పెట్టి.. అందులో పాలు, నీళ్లు కలిపి మరిగించాలి. ఒక పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఇంతలో బియ్యం పిండి, కొంచెం మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి ఉడుకున్న నీటి తేటను వేసుకుని పిండిని చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండిని చేతితో పొడవుగా చేసుకోవచ్చు.. (లేదా జంతికలు ఒత్తే గిద్దలో ఈ పిండిని వేసుకుని మరుగుతున్న నీటిలో డైరెక్ట్ గా ఒత్తుకోవచ్చు) అలా కఒత్తుకున్న తాళికలను మరుగుతున్న పాల మిశ్రమంలో వేసుకోవాలి. అవి ఉడుకున్న సమయంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. దింపే ముందు కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసుకోవాలి.