- Telugu News Photo Gallery Spiritual photos Ganesh Chathurthi 2021 The Festival And Science Behind It
Vinayaka Chavithi: చవితినాటి విగ్రహం, పత్రి , పిండివంటల సంప్రదాయంలో దాగిన విజ్ఞానం, సైన్స్ మీకు తెలుసా..
Vinayaka Chavithi: భాద్రపదమాసం చవితి తిథిని వినాయక వినాయక చవితిగా దేశ వ్యాప్యంగా హిందువులు అంగరంగ వైభంగా జరుపుకుంటారు. అయితే ఈ పండగలో పెట్టె గణేశ విగ్రహంనుంచి పూజకు ఉపయోగించే పత్రి, నైవేద్యంగా పెట్టె ఆహారపదార్ధాలు, చివరికి వినాయక విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయడం వరకూ నిర్వహించే సంప్రదాయంలో దాగిన విజ్ఞానం రహస్యాల గురించి తెలుసుకుందాం..
Updated on: Sep 07, 2021 | 3:10 PM

వినాయక మండపంలో ఎవరి శక్తి కొలదీ వారు వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. రాతి వినాయకుని పూజిస్తే జ్ఞానం, రాగి వినాయకుని పూజిస్తే ఐశ్వర్యం, వెండి విగ్రహంగా ఉన్న గణేశుని పూజిస్తే ఆయుష్షు, బంగారు వినాయకుని పూజిస్తే సంకల్పసిద్ధి లభిస్తాయట. కానీ మట్టితో చేసిన వినాయకుని ప్రతిమను పూజిస్తే సర్వమూ లభిస్తాయని గణేశ పురాణం చెబుతోంది.

పూర్వం నుంచి గణేష్ చతుర్థి రోజున మండపంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తారు. తర్వాత ప్రజలు విశ్వాసాన్ని బట్టి.. కొంతమంది మూడు రోజు, 9 లేదా 12 రోజులు ఉత్సవాలను జరుపుకుని తర్వాత నదుల్లో వినాయక నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడానికి కారణం.. మనిషి మనిషి మట్టి నుండి వచ్చి మట్టిలోకి వెళ్తాడు అని పెద్దల నమ్మకం

విఘ్నాలకధిపతి విఘ్నేశ్వరుడిని పసుపు గణపతిగా చేసి.. తొలి పూజ నిర్వహిస్తారు. ఈ తొలి పూజ వినాయక చవితితో సహా ప్రముఖంగా చేసుకునే పూజలు, శుభకార్యాలు అన్నింటిలోనూ ముందుగా పసుపు గణపతిని పూజించడం ఆనవాయితీ. దీనికి గల కారణం.. భారతీయులకు తెలిసిన తొలి ఔషధం బహుశా పసుపే అయి ఉంటుంది. అందుకనే ఆరోగ్యానికి, అందానికి, ఆహారానికి ఉపయోగంచే పసుపుని గణేశుడి రూపంలో ఆరాధిస్తారు.

గణేష్ చవితి రోజున 21 పత్రాలతో పూజిస్తారు. ఈ సీజన్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా నీటిలో పుట్టిన వ్యాధులు సాధారణంగా వ్యాప్తి చెందుతాయి. వినాయక పండుగ తరువాత, పూజించిన వినాయక విగ్రహాలతో పాటు పూజ ఆకులను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఆకులను నీటిలో భారీ పరిమాణంలో విసిరినప్పుడు.. వాటి ఔషధ గుణాల కారణంగా నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుందని పెద్దల నమ్మకం

ఆయుర్వేదంలో ఆవిరి వండిన ఆహారం సహజ నివారణ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్లనేమో.. వినాయకచవితి రోజున చేసుకునే పిండివంటలు ఉండ్రాళ్ళు, కుడుములు వంటివి ఆవిరితో చేస్తారు. ఆవిరిలో వండిన వస్తువులను సులభంగా జీర్ణించుకోవచ్చు. బియ్యపురవ్వ, బెల్లంతో చేసే పదార్థాలు ఆరోగ్యాన్నిస్తాయని పెద్దల నమ్మకం

వినాయకుని పూజించకుండా ఆనాటి చంద్రుని చూస్తే నీలాపనిందలబారిన పడతారని పెద్దల నమ్మకం దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. వినాయకచవితిరోజుకి సూర్యుడు భూమికి దూరంగా తులా రాశిలో ఉంటాడు. కనుక చంద్రుని మీద సూర్యుని కిరణాలు అంత చురుకుదనాన్ని కలిగించవు. ఇక చంద్రుడు మనఃకారకుడు అని జ్యోతిషులు చెబుతుంటారు . వీటి కారణాలతో మానవుని మనసు మరింత వ్యాకులతతోనూ, బుద్ధి మందగమనంగానూ ఉంటుంది. చిరాకుగా ఉన్న మనిషి తోటివారి మీద ఆ చిరాకుని చూపడం. నిందలు వేయడం, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం వంటి పొరపాట్లు చేస్తాడు. కనుక వినాయక చవితి రోజున చంద్రుని మనసు ప్రశాంతంగా ఉంటుందట.





























