Crime News: దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికపై ఆటో డ్రైవర్ల కన్ను.. కిడ్నాప్‌ చేసి సిటీ అంతా తిప్పుతూ..

Girl Kidnapped: మహారాష్ట్రలోని పూణే పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న 13 ఏళ్ల బాలికపై

Crime News: దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికపై ఆటో డ్రైవర్ల కన్ను.. కిడ్నాప్‌ చేసి సిటీ అంతా తిప్పుతూ..
Crime News

Girl Kidnapped: మహారాష్ట్రలోని పూణే పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న 13 ఏళ్ల బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అరెస్టయిన ఏడుగురు నిందితుల్లో ఐదుగురు ఆటో డ్రైవర్లు, ఇద్దరు రైల్వే ఉద్యోగులు ఉన్నారు. వన్వాడి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31న బాలిక ఇంటి నుంచి వెళ్లి మళ్లీ రాలేదు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు బాలికను పూణేలో గుర్తించారు. అనంతరం బాలికను విచారించగా.. తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వెల్లడించడంతో ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలిక తన స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు ఇంటి నుంచి పారిపోయి వచ్చి పుణే రైల్వేస్టేషన్‌కు చేరింది. ఈ క్రమంలో బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్.. బాలిక దగ్గరకు వెళ్లారు. తాను వెళ్లాలనుకుంటున్న రైలు ఆరోజు లేదని.. మరుసటి రోజు ఉందంటూ నమ్మబలికాడు. అనంతరం ఆ రాత్రికి తన ఇంట్లో ఉండమనని.. ఎలాంటి భయం అవసరం లేదంటూ నమ్మించాడు. అనంతరం బాలిక ఒప్పుకోవడంతో.. తనను ఆటోలో ఎక్కించుకొని పలువురు ఆటో డ్రైవర్లు సమాచారమిచ్చాడు. వారంతా కూడా మార్గమధ్యంలో ఆటో ఎక్కారు. అనంతరం మొత్తం 8 మంది కలిసి ఆ బాలికను ఆటోలో పలు ప్రాంతాలు తిప్పుతూ పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. చివరకు నిందితులు ముంబై వెళ్లే ఓ బస్సును బలవంతంగా ఎక్కించారని బాలిక తెలిపింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు ఆటో డ్రైవర్లు, ఇద్దరు రైల్వే ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్వాడి పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: తల్లి ఆడిస్తుండగా చిన్నారిని కాటేసిన తాచుపాము.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే..

AP Crime News: బట్టతల అందగాడు..! యువతులను మోసం చేయడంలో దిట్ట..

Click on your DTH Provider to Add TV9 Telugu