AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: రానా సినిమాలపై వీడని సందేహాలు.. విరాటపర్వం కూడా అదే దారిలోనా ?..

కరోనా ప్రభావంతో ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఇప్పటికీ కొలుకోవడం లేదు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా చిత్రపరిశ్రమ

Virata Parvam: రానా సినిమాలపై వీడని సందేహాలు.. విరాటపర్వం కూడా అదే దారిలోనా ?..
Virata Parvam
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2021 | 9:57 AM

Share

కరోనా ప్రభావంతో ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఇప్పటికీ కొలుకోవడం లేదు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా చిత్రపరిశ్రమ కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక ఇటీవలే థియేటర్లు తెరుచుకోవడంతో చిన్న, పెద్ద సినిమాలు విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్నాయి. అయితే ఇటీవల థియేటర్లలో విడుదలైన చిన్న సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో తమ సినిమాలను కూడా వీలైనంత తొందరంగా జనాల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అయితే సెకండ్ వేవ్ కంటే ముందే.. థియేటర్లలో విడుదల కావాల్సిన టక్ జగదీష్, విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు కోవిడ్ కేసులు పెరగడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడంతో థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేయాలని కొందరు నిర్మాతలు భావిస్తుండగా.. మరికొందరు ఓటీటీలను ఎంచుకుంటున్నారు. నాని ప్రధాన పాత్రలో నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. అంతేకాదు… సినిమా ప్రమోషన్స్ కూడా పెంచేసింది. అలాగే లవ్ స్టోరీ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ రానా సినిమాలపై స్పష్టత రావడం లేదు.

రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించగా.. చెరుకూరి సుధాకర్ నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందట. కేవలం 5 రోజుల షూటింగ్‏ను రానా తొందర్లో పూర్తిచేయనున్నారట. ఆ తర్వాత ఈ మూవీని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. నారప్ప సినిమా మాదిరిగానే ఈ మూవీని కూడా సురేష్ బాబు ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. కానీ అనుకోకుండా.. సురేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారని.. విరాట పర్వం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే థియేటర్లు ఓపెన్ అయి చాలా రోజులుఅవుతుంది. సరైన సినిమా పడితే థియేటర్లకు జనం రాక పెరుగుందనే అంటున్నారు నిర్వహకులు. దసరా తరువాత థియేటర్ల దగ్గర సందడి పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్ బాబు తన మనసు మార్చుకున్నారని అంటున్నారు.

Also Read:  Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాకోసం మహేష్ మాస్టర్ ప్లాన్.. మూవీ మొదలైయేది అప్పుడేనా. .?

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ.. గొడవలే గొడవలు.. ఎటాక్ చేస్తే ఒప్పుకొనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్యూటీ..