AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drug Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్.. సెలబ్రిటీలకు ఈడీ వేడి.. ఈరోజు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి.. ముమైత్ ఖాన్..

ఇటీవలే డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటిసులు పంపిన ఈడీ..

Tollywood Drug Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్.. సెలబ్రిటీలకు ఈడీ వేడి.. ఈరోజు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి.. ముమైత్ ఖాన్..
Rana
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2021 | 8:48 AM

ఇటీవలే డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటిసులు పంపిన ఈడీ.. పూరీ జనగ్నాథ్, ఛార్మి, రకుల్, కెల్విన్‏లను విచారిచిందింది. దీంతో ఈడీ.. కొందరిలో వేడి పుట్టిస్తోంది. డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో పాటు.. భారీగా ఆర్ధిక లావాదేవీలు జరిగాయనే అరోపణల మధ్య ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు మరో బిగ్ హీరో వంతు వచ్చింది. ఈరోజు భల్లాలదేవపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఈడీ సిద్ధమైంది.

కాసేపట్లో ఈడీ ముందుకు హీరో రానా హాజరుకాబోతున్నారు. రానా బ్యాంకు ఖాతాల వివరాలు ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తోంది. అందులోని లావాదేవీలు, ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులోని ఇతరులతో ఉన్న సంబంధాలపైనా రానాను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముమైత్ ఖాన్‌ను కూడా ఇవాళే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో రానా, రకుల్ పేర్లు లేవు. కానీ ఇప్పుడు ఈ కేసులో వీళ్లిద్దరికి ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశమైంది. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్‌క్లబ్‌లో పలుసార్లు నిర్వహించిన పార్టీలకు రకుల్‌, రానా హాజరైనట్లు తేలడంతో.. ఈడీ సమన్లు ఇచ్చింది.

డ్రగ్ రాకెట్‌లో కీలకంగా ఉన్న కెల్విన్‌ను నిన్న ఈడీ గ్రిల్ చేసింది. ఏకంగా 6 గంటలపాటు విచారించి.. డ్రగ్స్ సరఫరా, కెల్విన్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు నగదు బదలాయింపుపై ఆరా తీశారు. కెల్విన్‌ అకౌంట్‌లో పెద్ద మొత్తంలో నిధులు గుర్తించారు. 30 అకౌంట్ల నుంచి కెల్విన్‌ బ్యాంక్‌ ఖాతాలోకి నిధులు వెళ్లినట్టు నిర్ధారణ జరిగింది. కెల్విన్‌కు రెండు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు. విచారణ అనంతరం పంపిన ఈడీ.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు.

మరోవైపు రేపు రవితేజ.. ఆయన డ్రైవర్ శ్రీనివాస్, 13న నవదీప్‌, ఎఫ్‌క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, చార్మికౌర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌‌తో పాటు నందును విచారించారు అధికారులు.

Also Read: Bigg Boss 5 Telugu: మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేదే లేదు.. అతడి పై అరుస్తూ చిందులువేసిన ఆనీ మాస్టర్..

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..