Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేదే లేదు.. అతడి పై అరుస్తూ చిందులువేసిన ఆనీ మాస్టర్..

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఇంతాగానో ఆకట్టుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు సీజన్ 5తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ షో మొదలై అప్పుడే మూడురోజులైపోయింది. ఈసారి హౌస్‌లోకి...

Bigg Boss 5 Telugu: మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేదే లేదు.. అతడి పై అరుస్తూ చిందులువేసిన ఆనీ మాస్టర్..
Aani Mastar
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 08, 2021 | 5:21 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఇంతాగానో ఆకట్టుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు సీజన్ 5తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ షో మొదలై అప్పుడే మూడురోజులైపోయింది. ఈసారి హౌస్‌లోకి 19మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. షన్ముఖ్ -మానస్-ప్రియాంక సింగ్ – 7 ఆర్ట్స్ సరయు- సన్నీ-ఉమాదేవి-శ్రీరామచంద్ర-సిరి హనుమంతు-ప్రియ-శ్వేత వర్మ-లోబో-లహరి-జశ్వంత్-యాంకర్ రవి-నటరాజ్-కాజల్-విశ్వ-ఆనీ మాస్టర్-హమీద కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే. మొదలైన రెండో రోజు నుంచే హౌస్‌లో హీట్ పెరిగింది. నామినేష్ సమయంలో ఒకరి గురించి ఒకరు నెగిటివ్స్ బయటపెట్టుకుంటూ హడావిడి చేయగా.. నిన్న( సెప్టెంబర్ 7) జరిగిన ఎపిసోడ్‌లో ఏడుపులు. అరుపులు, గొడవలతో రచ్చ చేశారు ఇంటిసభ్యులు. కాజల్‌తో లహరి గొడవకు దిగింది. అంతకు ముందు ఉమా దేవి ఇంటి సభ్యుల పై సీరియస్ అయ్యింది. ఇంటిపనులు చేయకుండా ఎవరిపని వాళ్ళు చేసుకుంటున్నారని అంది. కిచెన్‌ పనిచేస్తున్న శ్వేత వర్మ, సరయులు.. మీరు వాళ్లందరికీ కాస్త సీరియస్‌గా చెప్పండి.. మీరు కూడా నవ్వుతు చెప్తే వాలు పట్టించుకోరు అని ఉమా దేవికి చెప్పారు.

ఆ తర్వాత ఆనీ మాస్టర్ మోడల్ జెస్సి పై ఫైర్ అయ్యింది. అయితే ముందు జెస్సీ హమీదాతో గొడవకు దిగాడు. సమయంలో ఎంటర్ అయినా ఆనీ మాస్టర్.. జెస్సీ పై సీరియస్ అయ్యింది. కూర్చునే స్టూల్‌పై కాలుపెట్టి జెస్సీ తన యాటిడ్యూడ్ చూపించాడు. దీంతో ఆనీ మాస్టర్ అతనిపై అరుస్తూ రచ్చ చేసింది. మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అంటూ ఫైర్ అయ్యింది ఆనీ. దీంతో జెస్సీ.. ఆనీ మాస్టార్‌కు సారి చెప్పాడు. అయినా ఆమె  వెనక్కి తగ్గలేదు.. కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆతర్వాత  రాత్రిసమయంలో ఆనీ మాస్టర్ ఏడుస్తూ కనిపించింది.

మరిన్ని ఇక్కడ చదవండి :