Karthika Deepam: దీపను చూసి మోనిత పరుగో పరుగు.. దీప కోసం కార్తీక్ వెతుకులాట!

ఆసక్తికరంగా సాగుతోంది కార్తీకదీపం సీరియల్. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఈరోజు 1139వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Karthika Deepam: దీపను చూసి మోనిత పరుగో పరుగు.. దీప కోసం కార్తీక్ వెతుకులాట!
Karthika Deepam Episode 1139
Follow us

|

Updated on: Sep 08, 2021 | 8:14 AM

Karthika Deepam: కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలి అనే ఒకే ఒక్క మోజుతో తనని తాను కష్టపెట్టుకుంటూ.. అందరినీ టెన్షన్ పెడుతోంది మోనిత. తాను చనిపోయానని లోకాన్ని నమ్మిస్తూ కార్తీక్ ను లాకప్ కు అక్కడ నుంచి ఆసుపత్రికీ చేర్చి.. పెళ్ళికోసం కొత్త పథకం వేసింది. పెళ్లి చేసుకోకపోతే.. కార్తీక్ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప ఎలాగైనా తనని పట్టుకోవాలని చూస్తుంటుంది.. మరో పక్క ఏసీపీ రోషిణి కార్తీక్ పట్ల పూర్తి వ్యతిరేక భావంతో ఉండి..అతన్ని కోర్టుకు తీసుకువెళ్ళడానికి సిద్ధం అవుతూ ఉంది.. ఈ నేపధ్యంలో ఆసక్తికరంగా సాగుతోంది కార్తీకదీపం సీరియల్. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఈరోజు 1139వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

నిన్నటి ఎపిసోడ్ (1138)లో ఏమైందంటే..

పోలీస్ స్టేషన్ లో మిస్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ గురించి ఏసీపీ రోషిణి కానిస్టేబుల్ రామసీతను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆమెను అనుమానంగా ప్రశ్నిస్తుంది. తరువాత చిన్న ఎంక్వయిరీ ఉందని చెప్పి..స్టేషన్ రైటర్ ను కార్తీక్ కేసు కాగితాలు కోర్టుకు పంపించమని చెబుతుంది. తాను కార్తీక్ ను తీసుకుని కోర్టుకు వస్తానని చెబుతుంది. మరోవైపు సౌందర్య తాను కోర్టుకు వెళతానని చెబుతుంది. ఆనందరావు కూడా కోర్టుకు వస్తానని అంటాడు. దానికి సౌందర్య వద్దని వారిస్తుంది. అక్కడ మీరు కార్తీక్ ను చూస్తె తట్టుకోలేరు. అంటుంది. దానికి ఆనందరావు ఇక్కడ ఉన్నా కార్తీక్ కు ఏమైందనే ఆలోచనలను తట్టుకోలేను. నేను నిబ్బరంగా ఉంటాను. నేనూ అక్కడికి వస్తాను అంటాడు. ఆనందరావు అలా అన్నాక సరే అంటుంది సౌందర్య. ఇద్దరూ కలిసి కోర్టుకు బయలుదేరుతారు.

దీప కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఎదో ఆలోచనలో ఉన్న కార్తీక్ ను చూసి ఏమిటి ఆలోచిస్తున్నారు. మీ మోహంలో కంగారు స్పష్టంగా బయటకు కనబడిపోతోంది. ఆనుతుంది దీప. నేను మీ గురించే ఆలోచిస్తున్నాను అంటాడు కార్తీక్. నాకంటే ఎక్కువ మీ గురించే ఆలోచన. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను జైలుకు వెళ్ళినా మీరంతా క్షేమంగా ఉండాలి అని కార్తీక్ చెబుతాడు. దీంతో దీపలో అనుమానం మరింత బలపడుతుంది. మీరు మోనితను చూశారు కదూ. అని అడుగుతుంది. ఆ విషయం చెప్పట్లేదు. మీరు మోనిత బ్రతికే ఉంది అని నమ్ముతున్నాను అని ఒక్క మాట చెప్పండి. అది ఏ కలుగులో దాక్కున్నా తీసుకువచ్చి రోషిణి మేడం కాళ్ళ ముందు పాడేస్తాను అని ఆవేశంగా అంటుంది. దానికి కార్తీక్ వద్దు అటువంటి సాహసాలు చేయొద్దు. నువ్వు రిస్క్ తీసుకోవద్దు. అని బ్రతిమిలాడతాడు.

మరోవైపు మోనిత పెళ్లి చేసుకోవడానికి.. ఆసుపత్రికి వెళ్ళడానికి సంతోషంగా తయారవుతూ ఉంటుంది. అయితే అక్కడికి వచ్చిన రామసీత మోనితను పోలీసులకు లొంగిపొమ్మని చెబుతుంది. కానీ..మోనిత ఒప్పుకోదు. ఏసీపీ రోషిణికి అనుమానం వచ్చిందని రామసీత మోనితకు చెబుతుంది. దీంతో మోనిత ”అయినా ఏమీ కాదు. నేను పెళ్లి చేసుకున్న వెంటనే లొంగిపోతాను. నువ్వేమీ కంగారు పడకు. ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు. ఎందుకంటే మీ ఫోన్ లు ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది.” అని చెబుతుంది. తరువాత రామసీత సరే మీ ఇష్టం అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదీ నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన కథ.

మోనితే కారణం..

ఆసుపత్రిలో కార్తీక్.. దీప మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ ను దీప తనకేమీ జరగదని చెబుతుంది. అతనికి ధైర్యం చెబుతుంది. అతనికి భోజనం పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది. దీంతో కార్తీక్ మన కష్టాలకు కారణం ఆ మోనిత అని అంటాడు. తరువాత మోనిత బ్రతికే ఉందని చెబుతాడు. పోలీస్ స్టేషన్ లో తనకు టీ ఇచ్చింది మోనిత అని చెబుతాడు. సరిగ్గా ఇలా చెబుతున్న సమయంలో మోనిత డాక్టర్ రీనా వేషంలో అక్కడకు వస్తుంది. కార్తీక్ అన్ని విషయాలు దీపకు చెప్పెస్తాడేమో అని భయపడుతుంది. వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్న ఎస్ఐ ఫోన్ ద్వారా కార్తీక్ తో మాట్లాడుతుంది. అన్ని విషయాలు ఎందుకు దీపకు చెబుతున్నావు అని కార్తీక్ ను నిలదీస్తుంది మోనిత. నేను నిన్ను పెళ్ళిచేసుకోవాలని వచ్చాను. ఇక్కడ దీప ఎందుకు ఉంది? వెంటనే పంపించేయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే బయట పడతావు లేదంటే జైలు పాలు అవుతావు అని బెదిరింపులు మొదలు పెడుతుంది.

దీపకు దొరికిపోయిన మోనిత..

ఈలోగా బయటకు భోజనం ప్లేట్లు కడగటానికి వచ్చిన దీప మోనితను చూస్తుంది. ఆమె వద్దకు వెళ్లి.. ఎన్నాళ్ళు తప్పించుకుందాం అని అనుకుంటున్నావు అని ఆవేశంగా అడుగుతుంది. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మోనిత దీపను నెట్టివేసి అక్కడే ఉన్న ఒక క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది. దీప వారణాశిని పిలిచి ఆ కారును వెంబడిస్తుంది. వారణాశి కారులో ఎవరు ఉన్నారు అని అడుగుతాడు. మోనిత అని చెబుతుంది దీప. దాంతో అనుమానంగా చూస్తాడు వారణాశి. నేనేమీ భ్రమ పడటం లేదు. మోనిత కారులో ఉంది. డాక్టర్ వేషంలో వచ్చి నాటకాలు ఆడుతోంది. నువ్వు కారును వెంబడించు. ఆమెను పట్టుకుంటే డాక్టర్ బాబును బయటకు తీసుకురావచ్చు అని చెబుతుంది. దీంతో వారణాశి ఇప్పుడు అది ఎక్కడికి పోతుంది. ఈరోజు దానిని వదిలేదే లేదు అని మోనిత కారును స్పీడుగా వెంబడిస్తాడు.

ఆమె నన్ను చంపడానికి వస్తోంది..

మోనిత కారు డ్రైవర్ ను స్పీడుగా పోనీయమని చెబుతుంది. ఆ డ్రైవర్ ఎక్కడకు వెళ్ళాలి మేడం అని ప్రశ్నిస్తాడు. ఎక్కడికో ఒకచోటికి త్వరగా పోనియ్యి అని అంటుంది మోనిత. అతను అయితే కారు బుక్ చేసుకుంది మీరు కాదా అని అడుగుతాడు. మోనిత కాదు అని చెప్పి పర్స్ లోంచి పెద్ద మొత్తంలో డబ్బులు డ్రైవర్ కు ఇస్తుంది. వేగంగా కారును పోనీయమని అంటుంది. దీంతో కారు డ్రైవర్ కు అనుమానం వస్తుంది ఎందుకు మీరు భయపడుతున్నారు. వెనుక కారులో ఉన్నవారేవారు? మీరేమైనా తప్పు చేశారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దీంతో మోనిత నేను కాదు తప్పు చేసింది.. వెనుక కారులో వస్తున్నావిడ తప్పుచేసింది. తను నా భర్తను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం చచ్చిపోయినట్టుగా నాటకం ఆడింది. ఇప్పుడు నాకు కనిపించింది. నేను ఆమెను పట్టుకోబోతే నన్ను చంపడానికి వస్తోంది అని చెబుతుంది.

దీప ఎక్కడికి వెళ్ళింది?

ఆసుపత్రిలో కార్తీక్ దీప ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడతాడు. అయితే, దీప కనబడదు. ఆసుపత్రిలో నర్సులను అడుగుతాడు. ఎవరూ చూడలేదని చెబుతారు. డాక్టర్ రీనా వచ్చిందా అని అడుగుతాడు. వారు రాలేదు అని చెబుతారు. దీంతో కార్తీక్ కు అనుమానం వస్తుంది. దీప మోనితను చూసి ఉంటుంది. మోనితను పట్టుకోవడానికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటాడు. దీపా అనవసరంగా రిస్క్ చేస్తున్నావు. ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నావు అని బాధపడుతూనే..ఆసుపత్రి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అక్కడే ఉన్న ఎస్ఐ అతనిని ఆపుతాడు. కార్తీక్.. ఎస్ఐ ని డాక్టర్ రీనాను చూశారా? అని అడుగుతాడు. లేదు.. అయినా ఆమె రాలేదు కదా.. నీతో ఫోన్ మాట్లాడింది కదా అని అంటాడు. అక్కడే ఉన్న రామసీతను కార్తీక్ నువ్వేమైనా.. దీపను కాని, డాక్టర్ ను కానీ చూశావా? అని అడుగుతాడు. లేదని ఆమె చెబుతుంది. ఎస్ఐ ఏమి జరిగింది అని కార్తీక్ ను ప్రశ్నిస్తాడు. నా భార్య దీప కనిపించడం లేదు అని చెబుతాడు. అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ, ఎస్ఐ అపుచేస్తాడు.

ఇదీ ఈరోజు ఎపిసోడ్ (1138)లో జరిగింది. దీప మోనితను పట్టుకోగాలిగిండా? కార్తీక్ ఆసుపత్రి దగ్గర ఏం చేశాడు. రోషిణి ఆసుపత్రి నుంచి కార్తీక్ ను కోర్టుకు తీసుకు వెళ్ళిందా? కోర్టులో ఏమి జరిగింది? ఇవన్నీ తెలియాలంటే.. రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1139 వరకూ వేచి చూడాల్సిందే.