Vinayaka chavithi: గణపతి పూజలో ఈ మొక్క ఉంటే చాలా డేంజర్.. ఎందుకో తెలుసా..

సిద్ధి, బుద్ధి ప్రదాత.. విజ్ఞాలను హరించే విఘ్నేశ్వరుడు.. ఆ తత్వం ఎంత చెప్పుకున్నా మనం అవగతం చేసుకున్నది గోరంత..! అర్థం చేసుకోవాల్సింది కొండంత! నిజంగా వినాయక నవరాత్రుల్లో ప్రకృతి తత్వం..

Vinayaka chavithi: గణపతి పూజలో ఈ మొక్క ఉంటే చాలా డేంజర్.. ఎందుకో తెలుసా..
Parthenium Hysterophorus Pl

సిద్ధి, బుద్ధి ప్రదాత.. విజ్ఞాలను హరించే విఘ్నేశ్వరుడు.. ఆ తత్వం ఎంత చెప్పుకున్నా మనం అవగతం చేసుకున్నది గోరంత..! అర్థం చేసుకోవాల్సింది కొండంత! నిజంగా వినాయక నవరాత్రుల్లో ప్రకృతి తత్వం..భారతీయ సంస్కృతిక వైభవం.. ఆధ్యాత్మిక పరిమళం ఉన్నాయి. ముఖ్యంగా వినాయక చవితిలో వినియోగించే మొక్కలు, వాటి ఉత్పత్తులను పరిశీలిస్తే… ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని గుర్తించారు. భారత ఔషధ మొక్కల మండలి ఈ అంశాలను ధ్రువీకరించింది కూడా. వినాయక చవితిలో ఉపయోగించే 21 రకాల మొక్కలు, వాటి ఆకులు, ఉత్పత్తుల్లో ఉన్న ఔషధ లక్షణాలపై తెలంగాణ ఔషధ మొక్కల మండలి అవగాహన కల్పిస్తోంది. తాజాగా వీటిపై ఒక నివేదికను కూడా రూపొందించింది. అయితే కొందరు తెలిసో.. తెలియకో ఓ మొక్కను కూడా పూజలో పెట్టేస్తున్నారు. ఇది చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది.

మ‌నం ఎక్క‌డ చూసినా క‌న‌ప‌డే క‌లుపు మొక్క‌ల్లో ఒక‌టి వ‌య్యారి భామ‌. దీనికి ర‌క‌ర‌కాల పేర్లు ఉన్నాయి. మ‌రికొంద‌రు ముక్కుపుల్లాకు గ‌డ్డి అని, అమెరికా అమ్మాయి అని, క్యారెట్ గ‌డ్డి అని కూడా అంటుంటారు. ‘వయ్యారి భామ’ అనే కలుపు మొక్క పంటలకు చాలా ప్రమాదకారిణి అని, తెలంగాణలో దీని ప్రభావం అధికంగా ఉందని వ్యవసాయ కళాశాల, అఖిల భారత సమన్వయ కలుపు నివారణ విభాగం చాలాసార్లు హెచ్చరించింది.

మ‌న దేశ రైతుల‌కు ఎక్కువ‌గా న‌ష్టం చేసే క‌లుపు మొక్క ఈ వ‌య్యారి భామ‌. పంట పైరుల ఎదుగుదల‌కు ఇది ఆటంకంగా మారి దిగుబ‌డులు త‌గ్గిస్తుంది. ప‌త్తి, మొక్క‌జొన్న‌, గోదుమ‌, మ‌ల్బ‌రి తోట‌లు, పూల తోట‌లు, మామిడి, కూర‌గాయ‌ల తోటల్లో ఈ క‌లుపు మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. పంట దిగుబ‌డిని ఏకంగా 40 శాతం మేర‌కు త‌క్కువ చేసే అతి కిరాత‌క క‌లుపు మొక్క ఈ వ‌య్యారి భామ‌.

దీని పుష్పాల నుంచి వ‌చ్చే పుప్ప‌డి రేణువులు మొక్క‌ల‌పై ప‌డి రైతులు వేసే పంట‌కు సంబంధించిన పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. ఈ మొక్క‌లు పంట‌లో తెగుళ్ల‌కు కూడా కార‌ణం అవుతాయి. రైతులు ఆర్థికంగానే కాదు ఆరోగ్య‌ప‌రంగానూ వ‌య్యారి భామ క‌లుపు మొక్కల వ‌ల్ల న‌ష్ట‌పోతుంటారు. ప్ర‌మాద‌క‌ర‌మైన డ‌ర్కాటైటీస్‌, ఎగ్జిమా, తీవ్ర జ్వ‌రం, ఉబ్బ‌సం, బ్రాంకైటీస్ వంటి వ్యాధులు ఈ మొక్క‌ల వ‌ల్ల వ‌స్తాయి. పొలాల్లో ప‌ని చేసే రైతుల‌కు ఈ మొక్క‌ల వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి.

ఇది రైతులకు మాత్రమే నష్టాన్ని కల్పించడమే కాదు మనుషులతోపాటు జంతువులకు కూడా చాలా ప్రమాదం. చర్మ సంబంధిత వ్యాదులను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా దీని పుప్పొడి కంట్లో పడితే కొన్ని సార్లు కళ్లు కూడా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..

Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu