Vastu Tips: మీ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా..! అయితే స్టడీ రూం వాస్తు మార్చాల్సిందే..?
Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు.
Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో బాగుండాలంటే కొన్ని నియమాలు అవసరం. ఇది పిల్లలకు కూడా వర్తిస్తుంది. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. అందుకోసం కష్టపడి మంచి స్కూల్‌లో చేర్పిస్తారు. వారు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. అయినా పిల్లవాడు చదువులో వెనుకబడుతున్నాడంటే స్టడీ రూం వాస్తుపై ఒక్కసారి ఆలోచించాల్సిందే. పిల్లలు చదువుకునే రూంలో వాస్తు నియమాలు సరిగ్గా ఉండాలి లేదంటే వారి మైండ్ డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది.
1. పిల్లల స్టడీ టేబుల్ వెనుక కిటికీ అస్సలు ఉండకూడదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది తీవ్రమైన వాస్తు దోషం. 2. పిల్లలు చదువుతున్నప్పుడు ఎల్లప్పుడు వారి ముఖం ఉత్తర లేదా తూర్పు దిశగా ఉండేలా చూసుకోవాలి. 3. పిల్లల రీడింగ్ టేబుల్ కవర్ తెలుపు రంగులో ఉండాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తెలుపు రంగు టేబుల్ కవర్ సాత్విక ఆలోచనలను పెంచుతుంది. 3. పిల్లల స్టడీ రూమ్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అప్పుడే గదిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. 4. పిల్లల అధ్యయన గదిలో సరస్వతి మాతా, వినాయకుడి చిత్రాలు ఉండేలా చూసుకోవాలి. హింసాత్మక చిత్రాలు ఎప్పుడూ పిల్లల స్టడీ రూమ్‌లో పెట్టకూడదు. 5. పిల్లల స్టడీ రూమ్ గోడలు ఎప్పుడూ పగిలి ఉండకూడదు. ఎల్లప్పుడూ లేత రంగులతో పెయింట్ చేసి ఉండాలి. లేత పసుపు, లేత గులాబీ లేదా లేత ఆకుపచ్చ రంగును ఎంచుకోవచ్చు. ఈ రంగులు తెలివితేటలు, జ్ఞానం, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. 6. వాస్తు ప్రకారం పిల్లల స్టడీ రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ ఉండకూడదు. ఒకవేళ్ ఉంటే ఎల్లప్పుడూ తలుపు మూసి ఉంచాలి. 7. వాస్తు ప్రకారం పిల్లల పుస్తకాల అల్మారా తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి.
8. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి మాత్రమే ఉంటుందని గ్రహించండి.