AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Korea: క్షిపణులు లేవు.. సాంకేతిక పరికరాల ప్రదర్శన లేదు.. అంతా హజ్మత్‌ సూట్‌లోనే.. కొంగొత్తగా కొరియా సైన్యం కవాతు

ఎప్పుడు ఏదోక అంశంలో సంచలనంగా ఉండే ఉత్తర కొరియా అధ్యక్షులు.. ఈసారి చాలా సాదాసీదగా కనిపించారు. ఉత్తర కొరియా 73 వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ సైన్యం వినూత్నంగా పరేడ్‌ నిర్వహించింది.

North Korea: క్షిపణులు లేవు.. సాంకేతిక పరికరాల ప్రదర్శన లేదు.. అంతా హజ్మత్‌ సూట్‌లోనే.. కొంగొత్తగా కొరియా సైన్యం కవాతు
North Korea Military Parade
Balaraju Goud
|

Updated on: Sep 10, 2021 | 2:57 PM

Share

North Korea Military Parade: ఎప్పుడు ఏదోక అంశంలో సంచలనంగా ఉండే ఉత్తర కొరియా అధ్యక్షులు.. ఈసారి చాలా సాదాసీదగా కనిపించారు. ఉత్తర కొరియా 73 వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ సైన్యం కొంగొత్తగా పరేడ్‌ నిర్వహించింది. గతంలో మాదిరిగా హంగు ఆర్బాటాలకు లేకుండా.. ఆయుధ సంపత్తిని బహిరంగపర్చకుండా.. క్షిపణుల జాడే లేకుండా.. కేవలం హజ్మత్‌ సూట్‌లో సైన్యం రాత్రి పూట పరేడ్‌ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయాలను అక్కడి మీడియా కథనాలను ప్రచురించాయి. ఆరేంజ్‌ రంగులో హజ్మత్‌ సూట్‌లో పరేడ్‌ చేస్తున్న ఉత్తర కొరియా సైన్యం ఫొటోలను ప్రముఖంగా ప్రచురించాయి. ఎలాంటి క్షిపణులనుగానీ, ఇతర సాంకేతిక పరికరాలనుగానీ ప్రదర్శించలేదని మీడియా పేర్కొంది.

ప్యాంగ్యాంగ్‌లోని కిమ్‌ II సంగ్‌ స్క్వేర్‌లోని బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన జాతీయ దినోత్సవాలకు దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హాజరై సైన్యం పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించారని కేసీఎన్‌ఏ వార్తా సంస్థ తెలిపింది. ఆరేంజ్ రంగు హజ్మత్‌ సూట్‌లను ధరించిన కొరియా సైన్యం కవాతు చేస్తున్న ఫొటోలను అధికార వర్కర్స్‌ పార్టీ పత్రిక రోడాంగ్‌ సిన్మున్‌ ప్రచురించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. సైన్యం కవాతు నిర్వహించింది. తీసుకున్నారు. ఉత్సవాలకు హాజరైన అధికారులతోపాటు ప్రజలు కూడా మెడికల్‌ గ్రేడ్‌ మాస్కులు ధరించారు.

అయితే, మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్లు, యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ వంటి కొన్ని సంప్రదాయ ఆయుధాలను మాత్రం ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచారు. బాలిస్టిక్‌ క్షిపణులను మాత్రం ప్రదర్శించలేదు. అలాగే, కిమ్‌ కూడా సైన్యాన్ని ఉద్దేశించి ఎలాంటి ప్రసంగం చేయలేదని తెలుస్తోంది. ఎప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించే కిమ్ ఈసారి సాదాసీదగా కనిపించడం అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. 1950 53 కొరియన్‌ యుద్ధంలో ఉత్తర కొరియా కోసం పోరాడిన చైనా దళాలు నిష్క్రమించిన అనంతరం.. రిజర్వ్‌ ఫోర్సెస్‌గా ప్రారంభించిన 57 లక్షల వర్కర్‌ పీసెంట్‌ రెడ్‌ గార్డ్స్‌ను ఏర్పాటు చేసింది. 2013 తర్వాత ఇలాంటి కవాతు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Read Also… Benefits Of Pomegranate Juice: ప్రతిరోజూ దానిమ్మ రసం తాగండి.. ఈ సమయంలో వచ్చే పెద్ద సమస్య నుంచి తప్పించుకోండి..