AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. కానీ స్వీట్లు చూసి ఆగలేకపోతున్నారా..! అయితే 4 ఆహారాలను ట్రై చేయండి..

Weight Loss: మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. కానీ స్వీట్లను చూసి ఆగలేకపోతున్నారా.. అలాంటి పరిస్థితులలో మిమ్మల్ని మీరు అదుపుచేసుకోవడం కష్టం.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. కానీ స్వీట్లు చూసి ఆగలేకపోతున్నారా..! అయితే 4 ఆహారాలను ట్రై చేయండి..
Weight Loss
uppula Raju
|

Updated on: Sep 08, 2021 | 1:43 PM

Share

Weight Loss: మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. కానీ స్వీట్లను చూసి ఆగలేకపోతున్నారా.. అలాంటి పరిస్థితులలో మిమ్మల్ని మీరు అదుపుచేసుకోవడం కష్టం. కానీ బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా చక్కెర వస్తువులకు దూరంగా ఉండాలి. ఇటువంటి సందర్భంలో మీరు తియ్యగా ఉండే ఈ నాలుగు ఆహారపదార్థాలను ఎంచుకోవచ్చు. ఇవి శరీర బరువును ఏ మాత్రం ప్రభావితం చేయలేవు. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1.మొలాసిస్ మీకు తియ్యటి ఆహారం అంటే ఇష్టముంటే మొలాసిస్‌ అనేది ఉత్తమ ఎంపిక. ఇది పాత వంటకం. ఇందులో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, డైటరీ ఫైబర్, విటమిన్ బి -6, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. తక్కువ కేలరీల ఫ్రూట్ సలాడ్ మీరు సాయంత్రం స్నాక్స్‌లో తక్కువ కేలరీల ఫ్రూట్ సలాడ్ తినవచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, నల్ల ద్రాక్ష, అరటి, తక్కువ కొవ్వు పెరుగు, బొప్పాయి, తేనె, ఉప్పు, నల్ల మిరియాలు కలపండి. ఈ వస్తువులన్నీ పోషకాలతో నిండి ఉంటాయి. కానీ కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.

3. అవిసె గింజల లడ్డు అవిసె గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది ఫ్యాట్ బర్న్‌లా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి సాయంత్రం అల్పాహారంలో అవిసె గింజల లడ్డులను తినవచ్చు. వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫుడ్‌ తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.

4. బెల్లం పాయసం తక్కువ కొవ్వు ఉన్న పాలు బెల్లం ఖీర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పదార్థాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే మీరు టెన్షన్ పడకుండా వీటిని తినవచ్చు. బరువు అస్సలు పెరగరు.

5. డ్రై ఫ్రూట్స్‌ మీరు సాయంత్రం స్నాక్‌లో డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవచ్చు. ఇది మంచి ఎంపిక అవుతుంది. ఆకలిని తగ్గించుకోవడానికి మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

అనుమతి లేని కట్టడాల కూల్చివేతలు.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్

RGV Bold Interviews: ఇదేం ఖర్మరా బాబూ!..వర్మ ఏమిటి..ఇలా తయారయ్యాడు…! అంత బోల్డస్యః.. (వీడియో).

కేంద్రం సంచలన నిర్ణయం.. ఎన్‌డీఏలో మహిళలకు చోటు..