Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Defence Academy: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎన్‌డీఏలో మహిళలకు చోటు..

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు తన నిర్ణయాన్ని తెలిపింది.

National Defence Academy: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎన్‌డీఏలో మహిళలకు చోటు..
Central Government
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 08, 2021 | 1:56 PM

కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఎన్డీయేలో శిక్షణ పొందడానికి, నావల్ అకాడమీ పరీక్షలో పాల్గొనడానికి మహిళా అభ్యర్థులను అనుమతించే దిశగా దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కేంద్రం సుప్రీం కోర్టుకు ఈ సమాచారాన్ని ఇచ్చింది.

ఈ అంశంపై అదనపు సొలిసిటర్ జనరల్(ASG) ఐశ్వర్య భాటి.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనానికి వివరిస్తూ.. ”ఎన్డీయేలో బాలికలకు ప్రవేశం లభిస్తుందన్న సమాచారాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము వివరణాత్మక అఫిడవిట్‌ను త్వరలోనే సమర్పిస్తాం. జూన్ 24న జరగాల్సిన పరీక్ష ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎన్డీయే ప్రవేశాలు యధాతధంగా కొనసాగేలా చూడాలని” ఏఎస్జీ సుప్రీం కోర్టును కోరింది. ప్రస్తుతం ఎన్డీయేలో మహిళలను చేర్చాలని సాయుధ సేవలు నిర్ణయించాయి. ఈ అంశంపై పూర్తిగా విశ్లేషణ జరుపుతున్నారంటూ కేంద్రం తరపు వాదనలను వినిపించిన ఏఎస్జీ.. కోర్టు నుండి రెండు వారాల సమయాన్ని కోరింది.

“సాయుధ దళాలు దేశంలో గౌరవనీయమైన శాఖ, వారు లింగ సమానత్వం కోసం మరింతగా కృషి చేస్తారని భావిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ  చర్యతో మేం సంతోషంగా ఉన్నాం. సంస్కరణలు ఒక రోజులో జరగవని మాకు తెలుసు” అని ధర్మాసనం వివరించింది. కాగా, ఎన్డీయే పరీక్షకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీం కోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లింగ వివక్ష చూపరాదని.. అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనితో తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు నేషనల్లో డిఫెన్స్ అకాడమీలో స్థానాన్ని కల్పించింది.

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!