Throwback Pic: ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Sep 07, 2021 | 9:53 PM

Throwback Pic: చిన్ననాటి గుర్తులు, జ్ఞాపకాలు, ఫోటోలు అన్నీ కూడా విలువైనవే. వాటిని చూసినప్పుడల్లా మనకి చిన్నతనం గుర్తుస్తుంది. అందుకే అప్పుడప్పుడూ..

Throwback Pic: ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!
Rare Photo

Follow us on

చిన్ననాటి గుర్తులు, జ్ఞాపకాలు, ఫోటోలు అన్నీ కూడా విలువైనవే. వాటిని చూసినప్పుడల్లా మనకి చిన్నతనం గుర్తుస్తుంది. అందుకే అప్పుడప్పుడూ సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను త్రోబ్యాక్ పిక్స్ పేరిట అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇదొక ట్రెండ్ అయిపోయింది. వాటిపై ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలతో పాటు హీరోలవి కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఈ ఫోటోలో స్కూల్ డ్రెస్‌లో చిన్నగా స్మైల్ ఇస్తూ ఫోటోకి ఫోజిచ్చిన బుడ్డోడు.. ఇప్పుడొక ఇండస్ట్రీకే సూపర్ స్టార్. అతడెవరో కనిపెట్టాలి. మీకో చిన్న క్లూ.. ఇతడు నటించిన ఓ సినిమా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అని చెప్పాలి. గుర్తుపట్టలేదా.! అతడెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ నివిన్ పాలీ. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమమ్’ సినిమా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్. ఈ సినిమాకు మలయాళంలోనే కాదు.. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే నివిన్ పాలీకి అన్నీ భాషల్లోనూ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి.

సెప్టెంబర్ 5, ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తన గురువులను గుర్తు చేసుకుంటూ ఈ మలయాళం సూపర్ స్టార్ తన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. కాగా, నివిన్ పాలీ ప్రస్తుతం ‘తురముఖం’, ‘కనకం కామిని కలహం’, ‘పదవెట్టు’, ‘బిస్మి స్పెషల్’ అనే సినిమాలు చేస్తున్నారు.

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..

 పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!

3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu