తెలంగాణ: స్కూళ్లకు మార్గదర్శకాలు జారీ.. తప్పనిసరిగా అమలు చేయాలంటూ ఆదేశాలు..
Telangana Schools: సుమారు 16 నెలల తర్వాత తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభమయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో హైకోర్టు..
సుమారు 16 నెలల తర్వాత తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభమయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో హైకోర్టు పలు కీలక ఆదేశాలు ఇవ్వడంతో.. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ మినహా మిగతా అన్ని పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సర్కార్ అనుమతించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ విద్యాసంస్థల్లో కోవిడ్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రకాల విద్యాసంస్థలు వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది.
విద్యాసంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
- ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి
- స్టూడెంట్స్, టీచర్లు ఎలప్పుడూ మాస్కులు ధరించాలి
- తరచూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వాడటం తప్పనిసరి
- విద్యార్థుల ఆరోగ్యంపై రెగ్యులర్ మోనిటరింగ్ చేయాలి
- పాఠశాల ఆవరణలో ఉమ్మడం నిషేధం
- విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలనుకుంటే ఆన్లైన్ తరగతుల ద్వారా చెప్పాల్సిందే
- ఫిజికల్ అటెండెన్స్ తప్పనిసరి కాదు
- వెనకబడిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ తప్పనిసరిగా దృష్టి సారించాలి.
- అవసరమైతే బ్రిడ్జి కోర్సులను అమలు చేయాలి
- పాఠశాల ఆవరణలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటయ్యేలా చూసుకోవాలి
- పిల్లలను స్కూలుకు పంపకపోతే పేరెంట్స్‌పై లేదా విద్యార్థిపై ఎలాంటి పెనాల్టీ విధించకూడదు
- పాఠశాల అసెంబ్లీ, గ్రూప్ డిస్కషన్స్, గేమ్స్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అనుమతి లేదు..
- మిడ్ డే మీల్స్ సమయంలో కిచెన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి
- పోషకాలు నిండిన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి
- కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్ దగ్గర ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి
- విద్యార్థులు ఎంట్రీ ఎగ్జిట్ సమయాల్లో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి
- ట్రాన్స్‌పోర్ట్ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలి
- ప్రతీ విద్యార్ధికి పాఠ్య పుస్తకాలు అందించాలి
- పెన్సిల్, పెన్, బుక్స్, ఫుడ్, వాటర్ బాటిల్స్, గ్లాసులు, ప్లేట్స్ ఇలా ఏవి కూడా విద్యార్ధులు ఒకరికొకరు షేర్ చేసుకోకుండా చూసుకోవాలి.
విద్యాశాఖ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇవే..
ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచారాదన్న విద్యాశాఖ.. ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని తెలిపింది. అలాగే ఏ విద్యార్ధికైనా కరోనా వస్తే.. ఆ స్టూడెంట్‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరికీ వెంటనే టెస్టులు చేయించాలని సూచించింది. అలాగే కరోనాతో మరణించిన వారి పిల్లలను ఏ కారణంతోనూ ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసేయకూడదని.. విద్యార్ధులు ఇంటి నుంచి చదువుకుంటామంటే అనుమతించాలని స్పష్టం చేసింది.
Also Read:
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..
పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!
ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!
కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!
3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?