Hyderabad: నగరంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హెచ్‌ఎమ్‌డీఏ.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 07, 2021 | 5:33 PM

Hyderabad: పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యవరణానికి హానికరంగా మారే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన..

Hyderabad: నగరంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హెచ్‌ఎమ్‌డీఏ.

Hyderabad: పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యవరణానికి హానికరంగా మారే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ఉపయోగించాలనే ఉద్దేశంతో నగర వ్యాప్తంగా ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే నగరంలోని చాలా చోట్ల ఈ విగ్రహాల పంపిణీ జరుగుతోంది. నగరంలో రద్దీ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు ఇలా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా 38 ప్రదేశాల్లో మొబైల్‌ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు.

అధికారులు విగ్రహంతో పాటు ఒక తులసి మొక్కను కూడా అందిస్తున్నారు. వినాయక విగ్రహానికి పూజల నిర్వహించిన తర్వాత తులసి మొక్క నాటిన కుండీలోనే విగ్రహాన్ని నిమర్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు ఇలా మట్టి విగ్రహాలను ఉచితంగా అందిస్తుండడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల వల్ల అందరిలో పర్యావరణ రక్షణ పట్ల చైతన్యం కలుగుతుందని చెబుతున్నారు.

ఇక ఈ విషయమై స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఐఏఎస్‌ అరవింద్ కుమార్ ట్వీట్‌ చేస్తూ.. నగర వ్యాప్తంగా 7000 మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నామని, ఏ ప్రదేశాల్లో, ఏ సమయంలో విగ్రహాలు అందిస్తున్నారన్న వివరాలను పేర్కొన్నారు. ఇక మట్టి విగ్రహాలు కావాలనుకునే వారు (కనీసం 200).. 9000627611 నెంబర్‌కి కాల్ చేస్తే మొబైల్‌ క్యాంప్‌ పంపిస్తామని అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌ మేట్స్‌ మధ్య మొదలైన రచ్చ రంబోలా.. లోబో మొహం పగులుద్దన్న సిరి..

Viral Pic: మీకో చిన్న పజిల్.. పులిని కనిపెట్టండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Gutta Jwala: గుత్తా జ్వాల వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూశారా.? వైఫ్‌ బర్త్‌డే కానుకగా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu