Gutta Jwala: గుత్తా జ్వాల వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూశారా.? వైఫ్‌ బర్త్‌డే కానుకగా..

Gutta Jwala Marriage Video: భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ జ్వాల గుత్తా, తమిళ హీరో విష్ణు విశాల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 2న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కరోనా కారణంగా...

Gutta Jwala: గుత్తా జ్వాల వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూశారా.? వైఫ్‌ బర్త్‌డే కానుకగా..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 07, 2021 | 4:37 PM

Gutta Jwala Marriage Video: భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ జ్వాల గుత్తా, తమిళ హీరో విష్ణు విశాల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 2న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల నడుమ వీరిద్దరి వివాహం జరిగింది. విశాల్‌ సోదరి వివాహంలో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న జంట ఏప్రిల్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా నేపథ్యంలో తక్కువ మంది అతిథులు హాజరైనప్పటికీ వివాహ వేడుకను మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఇక వీరి వివాహం జరిగి ఆరు నెలలు దగ్గరపడుతున్న సమయంలో తాజాగా హీరో విష్ణు విశాల్‌ వివాహానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. నేడు (సెప్టెంబర్‌ 7) గుత్తా జ్వాల పుట్టిన రోజు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశాల్‌ ఈ వీడియోను పోస్ట్ చేయడం విశేషం. ఈ వీడియోలో మెహందీ వేడుక నుంచి మొదలు, హల్దీ ఫంక్షన్‌, వివాహ వేడుక, రిసెప్షన్‌కు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఇక రిసెప్షన్‌ పార్టీలో విశాల్‌, జ్వాల కుటుంబ సభ్యులు చేసిన హంగామా మాములుగా లేదు. ఒకరికి మంచి మరొకరు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ క్యూట్‌ కపుల్‌ మ్యారేజ్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇదిలా ఉంటే వీరిద్దరి ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. 2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని మ్యారేజ్ చేసుకున్న జ్వాల.. పలు కారణాలతో 2011లో విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు. ఇక విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. వీరికి ఆర్యన్ అనే బాబు ఉన్నాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

Also Read: Kamma Corp Chairman: ‘చంద్రబాబు కొందరు చెంచాలతో సీఎం జగన్‌ని తిట్టిస్తున్నాడు’: కమ్మ కార్పొరేషన్ చైర్మన్

Manasa Varanasi: బాలికలపై లైంగిక వేధింపుల వ్యతిరేక ప్రచారానికి మిస్ ఇండియా 2021 మానస వారణాసి మద్ధతు

China Army: చైనా ఆర్మీ ఎంత బలంగా ఉంటుంది? అంచనా వేసిన అమెరికా..కొన్ని పత్రాలు లీక్..