AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Army: చైనా ఆర్మీ ఎంత బలంగా ఉంటుంది? అంచనా వేసిన అమెరికా..కొన్ని పత్రాలు లీక్..

చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) గురించి ప్రపంచానికి పెద్దగా వివరాలు లేవు. కమ్యూనిస్ట్ చైనా తన సైనికుల గణాంకాలను విడుదల చేయదు

China Army: చైనా ఆర్మీ ఎంత బలంగా ఉంటుంది? అంచనా వేసిన అమెరికా..కొన్ని పత్రాలు లీక్..
China Army
Follow us
KVD Varma

|

Updated on: Sep 07, 2021 | 4:05 PM

China Army: చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) గురించి ప్రపంచానికి పెద్దగా వివరాలు లేవు. కమ్యూనిస్ట్ చైనా తన సైనికుల గణాంకాలను విడుదల చేయదు లేదా సైనికులు ఉపయోగించే ఆయుధాల గురించి సమాచారం ఇవ్వదు. అయితే, యూఎస్ ఆర్మీ ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. అందులో చైనీస్ ఆర్మీ పీఎల్ఏ కి సంబంధించిన అనేక రహస్యాలు తెరమీదకు వచ్చాయి. చైనా సైన్యానికి సంబంధించి యుఎస్ ఆర్మీ విడుదల చేసిన డాక్యుమెంట్ పేరు ATP 7-100.3. ఈ డాక్యుమెంట్ లో మొత్తం 252 పేజీలు ఉన్నాయి. ఇది చైనా సైన్యం నిర్మాణం, సామర్ధ్యం గురించి చెబుతుంది. యూఎస్ ఆర్మీ శిక్షణ కోసం ఈ డాక్యుమెంట్ రూపొందించారు. దాని సహాయంతో, వారికీ చైనా సైన్యం గురించి కూడా అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది.

చైనా రక్షణాత్మకంగా భావించే నిర్ణయాలు, ఇతర దేశాలకు దూకుడుగా ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలనే నిర్ణయం దీనికి సరైన ఉదాహరణ. అయితే, డాక్యుమెంట్‌లో చైనా సైన్యం గురించి మాత్రమే ప్రస్తావించారు. 20 సంవత్సరాల పాటు చైనా సైన్యాన్ని నిరంతరం చూసిన తర్వాత అమెరికా ఈ నివేదికను సిద్ధం చేసింది. వీటిలో కొన్ని పత్రాలు ఇప్పుడు లీకయ్యాయి.

లీకైన అమెరికా పత్రాలలోని వివరాల ప్రకారం.. 3 చైనా సైన్యం మూడు విభాగాలుగా ఉంటుంది. అవి..

  1. తేలికపాటి వాహన సైన్యం
  2. భారీ సైన్యం
  3. సాయుధ వాహనాలు

2035 నాటికి చైనా అన్ని పాత ఆయుధాలను భర్తీ చేస్తుంది..

వార్తా సంస్థ ANI పత్రంలోని భాగాలను విడుదల చేసింది. దీని ప్రకారం, చైనా ప్రభుత్వం ప్రస్తుతం సైన్యంపై డబ్బు ఖర్చు చేయడం ద్వారా పాత ఆయుధాలను కొత్త ఆయుధాలుగా మారుస్తోంది. 2035 నాటికి, చైనా తన పాత ఆయుధాలన్నింటినీ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. సైనిక వాహనం విషయంలో అమెరికా సైన్యం కంటే చైనా సైన్యం ముందుంది. చైనాలో కూడా 18 రిజర్వ్ ఫోర్స్ యూనిట్లు ఉన్నాయి, కానీ అవి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు పరిగణించడం లేదు.

ముఖ్యమైన బ్రిగేడ్‌లు కొత్త ఆయుధాలను పొందుతాయి

చైనా సైన్యంలోని అతి ముఖ్యమైన బ్రిగేడ్‌లకు ముందుగా కొత్త ఆయుధాలు అందచేస్తారు. వీటి నుండి తీసివేసిన ఆయుధాలు తక్కువ ప్రాముఖ్యత కలిగిన బ్రిగేడ్‌లకు వెళతాయి. ఇటీవల లడఖ్‌లో భారత , చైనా సైనికుల మధ్య వాగ్వివాదం జరిగింది. అప్పుడు ఇండియా-చైనా సరిహద్దులోని జిన్జియాంగ్ మిలటరీ జిల్లాకు చైనా కొత్త సైనిక పరికరాలను పంపింది.

Also Read: Panjshir Live Video: పంజ్ షేర్ లో తోడుదొంగల గెలుపు.. పరార్ లో తిరుగుబాటు నాయకుడు అమ్రుల్లా సలేహ్.. లైవ్ వీడియో..

Pfizer vaccine: వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొత్త అనుమానాలు.. ఫైజర్‌ టీకా పొందినవారిలో తగ్గుతున్న యాంటీబాడీలు