Pfizer vaccine: వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొత్త అనుమానాలు.. ఫైజర్‌ టీకా పొందినవారిలో తగ్గుతున్న యాంటీబాడీలు

వరుసగా పండుగలు.. రెండేళ్లుగా కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు అనుభవాలు.. తాజాగా కేరళలో మరోసారి విజృంభిస్తున్న కరోనా రాకాసి.. దేశవ్యాప్తంగా మెల్ల మెల్లగా కేసులు పెరుగుతున్న సంకేతాలు..

Pfizer vaccine: వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొత్త అనుమానాలు.. ఫైజర్‌ టీకా పొందినవారిలో తగ్గుతున్న యాంటీబాడీలు
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 07, 2021 | 3:36 PM

Pfizer vaccine: వరుసగా పండుగలు.. రెండేళ్లుగా కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు అనుభవాలు.. తాజాగా కేరళలో మరోసారి విజృంభిస్తున్న కరోనా రాకాసి.. దేశవ్యాప్తంగా మెల్ల మెల్లగా కేసులు పెరుగుతున్న సంకేతాలు.. ఈ నేపథ్యంలో కరోనా విషయంలో ఏమాత్రం అలక్ష్యం పనికిరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ మన ఇంటి ముంగిటే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 5 రకాల టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. స్వదేశంలో తయారైన వాటితో పాటు విదేశాల్లో రూపొందిన వాటినికి కూడా అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫైజర్ టీకాను తీసుకువచ్చింది కేంద్రం. అయితే, ఈ వ్యాక్సిన్లలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి..

ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత… ఆ టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తయిన కొవిడ్‌ యాంటీబాడీలు 80% మేర తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌, బ్రౌన్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని చేపట్టారు. నర్సింగ్‌ హోమ్స్‌లో ఉంటున్న 120 మంది నివాసులు, 92 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి వారు రక్త నమూనాలను సేకరించారు. వాటిలో కరోనా యాంటీబాడీల స్థాయిల్ని లెక్కించారు. వాలంటీర్లంతా ఫైజర్‌ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారే. ‘‘టీకా తీసుకున్న 6 నెలల తర్వాత సార్స్‌-కొవ్‌-2 ప్రతినిరోధకాలు 80% మేర తగ్గిపోతున్నాయి. ఈ తగ్గుదల అందరిలోనూ ఒకేలా ఉంటోంది. నర్సింగ్‌ హోమ్స్‌ నివాసుల్లో 70% మందికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేంత స్థాయిలో యాంటీబాడీలు ఉండటం లేదు’’ అని పరిశోధనకర్త డేవిడ్‌ కెనడే చెప్పారు. డెల్టా రకం వైరస్‌ విజృంభిస్తున్నందున బూస్టర్‌ డోసు ఆవశ్యకతను తమ అధ్యయనం వెల్లడిస్తోందన్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధుల సగటు వయసు 76 ఏళ్లు, ఆరోగ్య కార్యకర్తల సగటు వయసు 48 సంవత్సరాలు. అయితే ఈ రెండు వయో వర్గాల వలంటీర్లలోనూ యాంటీబాడీల తగ్గుదల దాదాపు ఒకే రీతిలో జరిగిందని తేలడం గమనార్హం. ఇటువంటి వారికి మూడో (బూస్టర్‌) టీకా డోసు అవసరమని వైద్యనిపుణులు అంటున్నారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘మెడ్‌ ఆర్కైవ్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

మరోవైపు, దేశంలో కరోనా నియంత్రణకు టీకా ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ క్రమంలోనే వయల్‌లోని 11 డోసులనూ సద్వినియోగం చేస్తే.. కరోనా టీకా పంపిణీలో పదిశాతం ఖర్చును తగ్గించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందశాతం తొలి డోసు పంపిణీ పూర్తయిన నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలనుద్దేశించి సోమవారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. కాలికి గాయమైనా.. విధులకు హాజరవుతూ 22,500 డోసులు పంపిణీ చేసిన ఆరోగ్య కార్యకర్త కర్మోదేవిని మోదీ అభినందించారు. దేశంలో ఇటీవల ఒక్క రోజులో 1.25 కోట్ల డోసులు అంటే.. చాలా దేశాల జనాభా కంటే అధికమని మోదీ పేర్కొన్నారు.

Read Also….  Rashi Khanna: అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటానంటోన్న అందాల రాశీ.. మనసులో మాట బయట పెట్టిన ముద్దుగుమ్మ..

Tollywood Drug Case: ఓవైపు కొనసాగుతున్న నందు విచారణ.. మరోవైపు ఈడీ ఆఫీస్‌కు చేరుకున్న కెల్విన్..