AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటానంటోన్న అందాల రాశీ.. మనసులో మాట బయట పెట్టిన ముద్దుగుమ్మ..

Rashi Khanna: హిందీలో తెరకెక్కిన 'మద్రాస్‌ కేఫ్‌' సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. అనంతరం 'మనం' చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో నటించి..

Rashi Khanna: అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటానంటోన్న అందాల రాశీ.. మనసులో మాట బయట పెట్టిన ముద్దుగుమ్మ..
Narender Vaitla
|

Updated on: Sep 07, 2021 | 3:30 PM

Share

Rashi Khanna: హిందీలో తెరకెక్కిన ‘మద్రాస్‌ కేఫ్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. అనంతరం ‘మనం’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాల్లో గుడి కట్టుకుంది. తొలి చిత్రంతోనే తనదైన అందం, క్యూట్ నటనతో మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇక అటు నుంచి వెనుతిరిగి చూడని ఈ ముద్దుగుమ్మ వరుస బడా ఆఫర్లు కొట్టేస్తూ టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగులో బిజీ బిజీగా నటిస్తూ దూసుకుపోతోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

ఇదిలా ఉంటే రాశీ ఖన్నతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు నటీమణులు ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాశీ ఎక్కడ కనిపించినా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఎదురవగా.. పెళ్లి విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ.. తానకు కాబోయేవాడికి మాత్రం ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది.. తాను వివాహం చేసుకునే వాడు అందగాడు కాకపోయినప్పటికీ.. ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని చెప్పుకొచ్చింది. తన లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉన్న వ్యక్తి తనకు భర్తగా రావాలని చెప్పుకొచ్చిందీ రాశీ. మరి ఈ అందాల రాశీని సొంతం చేసుకోబేయే ఆ వరుడు ఎక్కడున్నాడో చూడాలి.

Also Read: Michael: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ది వైర్ ఫేమ్ మైఖేల్ విలియమ్స్ మృతి.. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లేనా ?

Sivani Rajasekhar: సోషల్ మీడియాలో మళ్ళీ మెరిసిన దొరసాని చెల్లెలు.. అందాలను ఎర వేస్తున్న న్యూ ఫొటోస్..

Hari Hara Veera Mallu: మళ్ళీ షూటింగ్ పట్టాలెక్కనున్న ‘హరిహర వీరమల్లు’.. నిరవధికంగా షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు