Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona: తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్.. అక్కడ మాత్రం తగ్గని పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా298 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,60,142కు చేరుకుంది.

Telangana Corona: తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్.. అక్కడ మాత్రం తగ్గని పాజిటివ్ కేసులు
Corona Virus
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 07, 2021 | 7:54 PM

Telangana Coronavirus Cases Today: తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా298 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,60,142కు చేరుకుంది. కాగా, ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా ఇద్దరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,888కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 325 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక, ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్‌ను జయించిన 6,50,778 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,476 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 68,097 కొవిడ్‌ టెస్టులు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,51,04,056 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 89 మందికి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక, జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి… 

Ts Corona

Ts Corona

మరోవైపు, దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఇంకా కొన‌సాగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 25 వేలకు త‌గ్గకుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 25,772 మందికి క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అయితే, కొత్తగా 27,320 మంది క‌రోనా బాధితులు ఆ వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిక‌వ‌రీల 39,93,877కు చేరింది. కొత్త‌గా ఇవాళ 189 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మృతుల‌ సంఖ్య 21,820కి పెరిగింది. అయితే, కేర‌ళ‌లో ఒక‌వైపు కరోనా కేసుల విజృంభణ కొనసాగుతుంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొవిడ్ ఆంక్షల‌ను స‌డ‌లిస్తూ నిర్ణయం తీసుకోవడం అశ్చర్యానికి గురిచేసింది.

Read Also…  Hiring trends 2021: జోరు మీదున్న ఐటీ రంగం.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా మూడు రెట్లు పెరగనున్న నియామకాలు..

Tamil Nadu: నిత్యానంద శిష్యులను తరిమికొట్టిన రాశిపురం గ్రామస్థులు.. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..?