AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: నిత్యానంద శిష్యులను తరిమికొట్టిన రాశిపురం గ్రామస్థులు.. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..?

స్వామి నిత్యానంద శిష్యులకు ఛేదు అననుభవం ఎదురైంది. రాశిపురం సమీపంలో ఒక మహిళా శిష్యుడితో కలిసి స్వగ్రామానికి వచ్చిన నిత్యా నంద శిష్యులను గ్రామస్తులు తరిమికొట్టారు.

Tamil Nadu: నిత్యానంద శిష్యులను తరిమికొట్టిన రాశిపురం గ్రామస్థులు.. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..?
Nithyananda Disciples
Balaraju Goud
|

Updated on: Sep 07, 2021 | 7:07 PM

Share

Nithyananda disciples: స్వామి నిత్యానంద శిష్యులకు ఛేదు అననుభవం ఎదురైంది. రాశిపురం సమీపంలో ఒక మహిళా శిష్యుడితో కలిసి స్వగ్రామానికి వచ్చిన నిత్యా నంద శిష్యులను గ్రామస్తులు తరిమికొట్టారు. సోమవారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.

నామక్కల్ జిల్లా రాశిపురం పక్కన మునియప్పం పాలయం ప్రాంతానికి చెందిన వ్యాపారి రామస్వామి భార్య అత్తయిలక్ష్మి(52).. నిత్యానంద ప్రవచనాల మీద ఆసక్తితో బెంగళూరు ఆశ్రమంలో చేరారు. బెంగళూరు ఆశ్రమంలో 2017 నుండి నిత్యానంద శిష్యురాలుగా మారిపోయారు. అయితే, ఎన్నసార్లు ఆమెను తిరిగి రావల్సిందిగా రామస్వామి వేడుకున్నా. అత్తయిలక్ష్మి అందుకు నిరాకరించింది. ఇక అప్పటి నుంచి రామస్వామి భార్య ఐదు సంవత్సరాలుగా బెంగళూరు లో ఉన్న నిత్యానంద ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు. కాగా, తన భార్యని నిత్యానంద ఆశ్రమం నుండి విడిపించాలని రామస్వామి నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

ఇదిలావుంటే, రామసామి ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు, దుకాణం భార్య అత్తయిలక్ష్మి పేరు మీద ఉన్నాయి. దీంతో అత్తయిలక్ష్మి బ్యాంక్ నుండి రూ.6.40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ సొమ్మును నిత్యానందపై ఉన్న భక్తితో.. ఆమె భర్త తెలియకుండానే 2017 లో రూ .6.40 లక్షలతో బెంగళూరులోని ఒక ఆశ్రమానికి ఇచ్చేసింది. ఆ తర్వాత అత్తియ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబం పదేపదే వ్యక్తిగక్తితంగా.. ఫోన్లో పిలిచినప్పటికీ అందుబాటులో లేకుండాపోయింది. ఈ సందర్భంలో.. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో అధికారలు ఇల్లు జప్తు చేసి వేలం వేసేందుకు సిద్ధమయ్యారు.

దీంతో రామస్వామి ఆస్తుల వేలం విషయంలో రాశిపురానికి నిత్యానంద శిష్యులను కారు లో వెంటతీసుకుని అత్తయిలక్ష్మి సొంతూరుకు వచ్చారు. ఇది గమనించిన గ్రామస్థులు.. నిత్యానంద శిష్యులను ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. నిత్యానంద శిష్యులఫై దాడికి దిగారు మహిళలు. గ్రామస్థులు దాడికి దిగడంతో నిత్యానంద శిష్యులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. అక్కడి నుంచి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లిన నిత్యానంద శిష్యులు.. గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also… Indian Railways: ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు..ఏసీ 3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ సౌకర్యం ప్రారంభం