Indian Railways: ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు..ఏసీ 3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ సౌకర్యం ప్రారంభం

KVD Varma

KVD Varma |

Updated on: Sep 07, 2021 | 6:59 PM

రైలు ప్రయాణీకులు ఇప్పుడు తక్కువ ఖర్చుతో AC కోచ్‌ల కంటే మెరుగైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరు. దీని కోసం, AC-3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ సౌకర్యం ప్రారంభమైంది.

Indian Railways: ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు..ఏసీ 3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ సౌకర్యం ప్రారంభం
3rd Ac Economy Coach

Indian Railways: రైలు ప్రయాణీకులు ఇప్పుడు తక్కువ ఖర్చుతో AC కోచ్‌ల కంటే మెరుగైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరు. దీని కోసం, AC-3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ సౌకర్యం ప్రారంభమైంది. యాగరాజ్-జైపూర్-ప్రయాగరాజ్ డైలీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (02403/02404) లో మొదటి కోచ్ అమర్చారు. త్వరలోనే దేశామంతా ప్రవేశపెట్టనున్న ఈ ఎకానమీ ఏసీ కోచ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

AC-3 టైర్ కంటే ఛార్జీ 8% తక్కువ

ఈ AC-3 టైర్ కోచ్ 72 కి బదులుగా 83 సీట్లు ఉంటాయి. ఛార్జీ AC-3 టైర్ కంటే 8% తక్కువ ఉంటుంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలాలో ప్రారంభానికి 50 ఎసి-కోచ్ ఎసి -3 టైర్లు రెడీగా ఉన్నాయి. త్వరలో మరో రెండు రైళ్లలో ఇటువంటి కోచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక రైలు 02429/02430 న్యూఢిల్లీ-లక్నో AC స్పెషల్, మరొకటి 02229/02230 లక్నో మెయిల్. క్రమేపీ వీటిని దేశమంతా విస్తరిస్తారు.

హ్యాండ్స్ ఫ్రీ వాష్ బేసిన్..

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కోచ్‌లో డిజైన్ స్థాయిలో అనేక మార్పులు చేశారు. భారతీయ, పాశ్చాత్య తరహా మరుగుదొడ్ల రూపకల్పన మెరుగుపరిచారు. వాష్ బేసిన్ హ్యాండ్స్‌ఫ్రీగా తయారు చేశారు. .

ప్రతి బెర్త్ ప్రయాణీకులకు AC చల్లని గాలి

AC-3 టైర్ యొక్క ఎకానమీ కోచ్‌లో చక్కని సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి బెర్త్ ప్రయాణీకులకు AC చల్లని గాలి వస్తుంది. ఇది కాకుండా, దిగువ బెర్త్ దగ్గర ఉన్న స్నాక్ టేబుల్ సులభంగా మడిచేలా ఉంటుంది. సైడ్ బెర్త్‌లోని దిగువ సీటుపై కూడా అలాంటి సదుపాయం ఇచ్చారు.

ప్రతి సీటుకూ USB ఛార్జింగ్ పాయింట్

మధ్య, ఎగువ బెర్తులు పైకి ఎక్కడానికి సౌకర్యవంతమైన మెట్లు ఏర్పాటు చేశారు. దీనితో పాటు, ఈ రెండు బెర్త్‌లలో హెడ్‌రూమ్ కూడా పెంచారు. కూర్చున్నప్పుడు తల ఎగువ బెర్త్‌ని తాకే అవకాశం తక్కువ. ప్రతి సీటులో బాటిల్ స్టాండ్, రీడింగ్ లైట్ అదేవిధంగా, USB ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి.

ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు

వికలాంగుల సౌకర్యార్థం, కోచ్, టాయిలెట్ రెండింటి తలుపులు వెడల్పుగా అందించారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి కోచ్‌లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్..ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నాయి. వీటిలో, ప్రయాణీకుల భద్రత, వారి వస్తువుల కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ ఫైర్ సేఫ్టీ విధానం..

ఈ కోచ్‌ల తయారీలో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పైర్ సేఫ్టీ సిస్టం అమర్చారు. దీనికోసం ప్రత్యెక, పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది కాకుండా, రాత్రిపూట లైట్లు ఆపివేసి ఉన్నప్పటికీ, చీకటిలో కూడా బెర్త్ సంఖ్యలు మెరుస్తూ ఉండేలా ఫ్లోరెసెంట్ ఏర్పాటు చేశారు.

తక్కువ ఖర్చుతో అత్యంత ఆధునికమైన ఈ ఏసీ కోచ్ లలో ప్రయాణం చక్కని అనుభూతి ఇస్తుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఇంతవరకూ ఉన్న ఏసీ కోచ్ లలో ఉన్న లోపాలను సరిచేస్తూ ఈ కోచ్ లకు రూపకల్పన చేసినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దేశమంతా ఈ తరహా ఏసీ కోచ్ లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Maruti Car Recall: మారుతీ కొన్ని కార్లను రీకాల్ చేసింది.. ‘రీకాల్’ అంటే ఏమిటి? ఎందుకు? కస్టమర్‌కు దీనితో లాభమా? నష్టమా?

Martian soil: అంగారక గ్రహ ఉపరితల పదార్ధాలు తొలిసారిగా భూమిపైకి..నాసా కొత్త చరిత్ర

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu