Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasa Varanasi: బాలికలపై లైంగిక వేధింపుల వ్యతిరేక ప్రచారానికి మిస్ ఇండియా 2021 మానస వారణాసి మద్ధతు

బాలికలు, మహిళల రక్షణ కోసం భరోసా కేంద్రం బాగా పనిచేస్తోందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నగరంలోని భరోసా కేంద్రంలో వికెన్ క్యాంపేయిన్‌ను శనివారం నిర్వహించారు.

Phani CH

|

Updated on: Sep 07, 2021 | 4:26 PM

బాలికలు, మహిళల రక్షణ కోసం భరోసా కేంద్రం బాగా పనిచేస్తోందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు.

1 / 10
బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నగరంలోని భరోసా కేంద్రంలో వికెన్ క్యాంపేయిన్‌ను శనివారం నిర్వహించారు.

2 / 10
 కార్యక్రమంలో ఉమెన్, చైల్డ్ శాఖ రాష్ట్ర కమిషనర్ దివ్య, నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్ మహంతి, డిసిపి శిరీషా, మిస్‌ఇండియా 2020 మానసా వారణాసి తదితరులు పాల్గొన్నారు.

3 / 10
కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యువతులు, మహిళలు అన్ని రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడుతున్నారని తెలిపారు.

4 / 10
మిస్ ఇండియా మానసా వారణాసి బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావడం, అలాగే వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను గురించి అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు.

5 / 10
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల బాలికలకు పూర్తిగా రక్షణ లభించేదని, ఇప్పుడు భార్యభర్త ఉద్యో గం చేయడం వల్ల బాలికలకు ఒంటరిగా ఉంటున్నారని తెలిపారు. అందువల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు.

6 / 10
 మహిళల విద్య వల్ల అన్ని అనర్ధాలకు చెక్‌పెట్ట వచ్చని అన్నారు. భరోసా కేంద్రానికి వచ్చిన కేసులను నగరంలోని 66 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.

7 / 10
అందులో నిందితులు 86మందికి కోర్టు శిక్ష విధించిందని తెలిపారు. నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్ మాట్లాడుతూ భరోసా కేంద్రం సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఓ నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో 25 ఏళ్ల జైలు శిక్ష పడిందని తెలిపారు.

8 / 10
సైబర్ స్మార్ట్ ప్రోగ్రాంలో భాగంగా నగరంలోని 100 పాఠశాలల్లో బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వి కెన్‌లో భాగంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని పాఠ శాలలు, ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు అవగాహన కల్పించాల నిన కోరారు.

9 / 10
మహిళలు, బాలికల సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య మాట్లాడుతూ బాలిక రక్షణ కోసం ప్రత్యేకంగా టెలీ ఫోన్ నంబర్ 1098 ఉందని తెలిపారు. డయల్ 100 వలెనే ఇది కూడా పనిచేస్తుం దని అన్నారు.

10 / 10
Follow us