Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamma Corp Chairman: ‘చంద్రబాబు కొందరు చెంచాలతో సీఎం జగన్‌ని తిట్టిస్తున్నాడు’: కమ్మ కార్పొరేషన్ చైర్మన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు చెంచాలతో సీఎం జగన్‌ని తిట్టిస్తున్నారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్

Kamma Corp Chairman: 'చంద్రబాబు కొందరు చెంచాలతో సీఎం జగన్‌ని తిట్టిస్తున్నాడు': కమ్మ కార్పొరేషన్ చైర్మన్
Kamma Corp Chairman Tummala
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 07, 2021 | 4:27 PM

Tummala Chandra Shekar: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు చెంచాలతో సీఎం జగన్‌ని తిట్టిస్తున్నారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ విమర్శించారు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిస్తున్నాడు అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సొంత జిల్లాలో కనీసం నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని తుమ్మల ఎద్దేవా చేశారు.

“టీడీపీ వల్ల కమ్మ జాతి ఎలా నష్టపోయిందో మీ బుచ్చియ్య చౌదరి చెప్పాడు.. కాలేజీ రోజుల్లోనే నిన్ను ఓడించిన వ్యక్తి పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థాయికి నీ చెంచాలు, నువ్వూ సరిపోరు.. కుప్పంలో నన్ను నిలబెట్టి కూడా జగన్ బొమ్మ పెట్టి పెద్దిరెడ్డి గెలిపించగలరు. తండ్రీకొడుకుల్లో ఎవరైనా పోటీకి రండి.” అని తుమ్మల సవాల్ చేశారు. బూతులు తిడితే నాయకుడ్ని అయిపోతానని లోకేష్ కలలు కంటున్నాడని తుమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీసీలు, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఏపీ పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 217 జీఓపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆక్వారంగం ఎలా ఉంది..? ఇప్పుడెలా ఉందని మంత్రి టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో హార్బర్‌ ఉండేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చర్యలు చేపట్టారన్నారు. విద్యుత్‌ సబ్సిడీలను ఇచ్చి ఆక్వారంగాన్ని ఆదుకుంటున్నామన్నారు. కరోనా కారణంగా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని మంత్రి సీదిరి అప్పలరాజు అమరావతిలో చెప్పుకొచ్చారు.

ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు చేపట్టారని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి సీదిరి తెలిపారు. ప్రజల బాగు కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా..? అని ఆయన ప్రశ్నించారు.

Read also: Aging Parents – Awful facts: వృద్ధులపై ఇళ్లల్లో జరుగుతోన్న హింసపై భయంకర నిజాలు.. ఎవరెవరివల్ల ఎంతెంత అంటే..?