Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aging Parents – Awful facts: వృద్ధులపై ఇళ్లల్లో జరుగుతోన్న హింసపై భయంకర నిజాలు.. ఎవరెవరివల్ల ఎంతెంత అంటే..?

వృద్ధాప్యం. ప్రతి మనిషి జీవితంలో చివరి అంకం. వృద్ధాప్యంలో ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు. కొంచెం ప్రేమ.. గుప్పెడు అన్నం. మరి, కన్నబిడ్డల నుంచి ఆ ప్రేమ, ఆదరణ దక్కకపోతే

Aging Parents - Awful facts: వృద్ధులపై ఇళ్లల్లో జరుగుతోన్న హింసపై భయంకర నిజాలు.. ఎవరెవరివల్ల ఎంతెంత అంటే..?
Parents
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 07, 2021 | 3:38 PM

Aged Persons: వృద్ధాప్యం. ప్రతి మనిషి జీవితంలో చివరి అంకం. వృద్ధాప్యంలో ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు. కొంచెం ప్రేమ.. గుప్పెడు అన్నం. మరి, కన్నబిడ్డల నుంచి ఆ ప్రేమ, ఆదరణ దక్కకపోతే ఏం చేస్తారు? చావలేక బతుకుతారు. వృద్ధులపై జరుగుతోన్న హింసపై ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో భయంకర నిజాలు తెలిశాయ్. వృద్ధుల కళ్లల్లో కొండంత ఆవేదన సదరు సర్వేలో కనిపిస్తోంది. వీళ్లంతా అనాథలు కాదు. తమ బిడ్డల కోసం అహర్నిశలు కష్టపడి, వాళ్లను ప్రయోజకులను చేసి, ఆస్తులను పంచి ఇచ్చినవాళ్లు. అందరూ ఉన్నా, ఇప్పుడు ఇంట్లోనే దిక్కూమొక్కూ లేకుండా, మరికొందరు వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నారు.

వృద్ధులపై సొంత కుటుంబసభ్యులు జరుపుతోన్న హింసపై హెల్ప్ ఏజ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో భయంకర నిజాలు బయటపడ్డాయి. 62.1శాతం వృద్ధులు శారీరక, మానసిక హింసకు గురవుతున్నట్లు తేలింది. 35.7శాతం వృద్ధులు.. అందరూ ఉండి కూడా వృద్ధాశ్రమాల్లో ఉంటూ ఒంటరితనానికి గురైనట్లు తేలింది. తాను పస్తులుంటూ, పిల్లలను ప్రేమగా పెంచితే, ఇప్పుడు తనను ఓల్డేజ్ హోమ్‌లో పడేసి వెళ్లిపోయారంటూ అనేక మంది తల్లులు వాపోయారు.

60 ఏళ్లు పైబడినవాళ్లలో 12 శాతం ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోనే ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 30శాతం వయోవృద్ధులు నిరాధరణకు గురవుతారని అంచనా వేశారు. వయోవృద్ధుల సంరక్షణకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయ్. హింసించినా, వేధించినా.. పిల్లల నుంచి తిరిగి తమ ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.

కొవిడ్ అండ్ లాక్ డౌన్ టైమ్ లోనే ఎక్కువగా వృద్ధులు హింసకు గురైనట్లు సర్వేలో తేలింది. పిల్లల హింసను భరించలేక కొందరు స్వచ్ఛందంగా ఓల్డేజ్ హోమ్స్ లో చేరితే, మరికొందర్ని బలవంతంగా చేర్పించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఏ తల్లిదండ్రులైనా.. వృద్ధాప్యంలో పిల్లలు తమకు అండగా ఉంటారని భావిస్తారు.. కోరుకుంటారు. కానీ, ఆ ఆశను కోల్పోతున్నారు వయోవృద్ధులు. మరోవైపు, ఏదో ఒక రోజు తాము కూడా వృద్ధాప్యంలోకి అడుగుపెడతామన్న జీవిత సత్యాన్ని మర్చిపోతున్న పిల్లలు.. తమ కన్న తల్లిదండ్రులను హింసిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారు. అయితే, వృద్ధులపై హింస రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందన్న నిజమే ఇప్పుడు మరింత భయపెడుతోంది.

వృద్ధ తల్లిదండ్రులకు ఎవరి వల్ల ఎంత హింస:

కొడుకుల వల్ల 43.8శాతం కోడళ్ల వల్ల 27.6శాతం కూతుళ్ల వల్ల 14.2శాతం 60.1శాతం మానసిక హింస 61.6 శాతం డబ్బు కోసం 58.6 శాతం శారీరక హింస వృద్ధులకు జరుగుతోన్నట్టు సదరు సర్వే స్పష్టం చేసింది.

Read also: Telangana Rains: తెలంగాణలోని 20 జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు.. అక్కడే ఉండాలంటూ ఆదేశాలు