Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: కాల్ కొట్టు.. గణేశుడి ప్రతిమ పట్టు.. హైదరాబాద్‌లో 70 వేల విగ్రహాల రూపకల్పన..

Vinayaka Chavithi: వినాయక చవితి.. విఘ్నాలు తొలగించే గణనాథుడిని 9 రోజులు కొలిచే పండుగ. ప్రతీ ఇంటా గణనాథుడి ప్రతిమలను ప్రతిష్టిస్తుంటారు. ఇక హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో..

Vinayaka Chavithi: కాల్ కొట్టు.. గణేశుడి ప్రతిమ పట్టు.. హైదరాబాద్‌లో 70 వేల విగ్రహాల రూపకల్పన..
Eco Ganesha
Follow us
Surya Kala

|

Updated on: Sep 07, 2021 | 3:58 PM

Vinayaka Chavithi: వినాయక చవితి.. విఘ్నాలు తొలగించే గణనాథుడిని 9 రోజులు కొలిచే పండుగ. ప్రతీ ఇంటా గణనాథుడి ప్రతిమలను ప్రతిష్టిస్తుంటారు. ఇక హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో హడావిడి అంతా ఇంతా కాదు. ఒక్కటే కోలాహలం.. కానీ కరోనా వల్ల వినాయక చవితి శోభ తగ్గింది. గతేడాది అయితే కేసుల వల్ల ఎక్కడికి అక్కడ నిలిపివేశారు. ఇప్పుడు మాత్రం కాస్తంతా పర్మిషన్ ఇస్తున్నారు. దీంతో ఎక్కడచూసినా గణనాథుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి. ఆ దేవదేవుడిని కొలిచేందుకు భక్త జనం సిద్దమవుతోన్నారు.

గణనాథుల విగ్రహాలు

వినాయక చవితి పండుగ వస్తోంది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గణనాథుల విగ్రహాలు దర్శమిస్తున్నాయి. కానీ పర్యావరణానికి హాని కలుగని గణేషుల విగ్రహాలనే పూజించాలని ప్రతీ ఒక్కరు మరవకూడదు. మట్టి వినాయకులనే పూజించాలని అధికారులు పదే పదే చెబుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లో మరోసారి అటువంటి నినాదాలే వినిపిస్తున్నాయి. దీంట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్‌ఎండీఏ వినాయక మట్టి ప్రతిమలను ఇంటి వద్దే ఉచితంగా అందజేసేందుకు చర్యలు చేపట్టింది.

ఉచితంగా పంపిణీ

వేలాదిగా మట్టి వినాయకుడు విగ్రహాలను తయారు చేయించి ప్రజలకు పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 70 వేలకుపైగా మట్టి విగ్రహాలను తయారు చేయించింది. వాటిని ప్రజలకు పంచటానికి ఏర్పాట్లు చేసింది. అలా తయారు చేయించిన విగ్రహాలను పలు ప్రాంతాలకు తరలించి ఆయా ప్రదేశాల్లో పంపిణీ చేయనుంది. 200 విగ్రహాలు పైబడి అవసరం ఉన్న ప్రాంతంలో ఫోన్‌ చేస్తే తమ సిబ్బంది ఇంటికే తీసుకొచ్చి గణనాధుల విగ్రహాలను ఇస్తారని పురపాలకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తెలిపారు.

38 ప్రాంతాలు..

ఇప్పటికే కొన్ని ముఖ్య ప్రాంతాల్లో మట్టి విగ్రహాల పంపిణీ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ నెల 6,8,9 తేదీల్లో 38 ప్రాంతాల్లో విస్తృతంగా అందజేస్తామని వెల్లడించారు. ఆదివారం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన సందర్శకులకు హెచ్‌ఎండీఏ అధికారులు ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేశారు. ఎకో ఫ్రెండ్లీగా గణనాథుడిని పూజిద్దాం అని కోరుతున్నారు.

ఎకో ఫ్రెండ్లీ..

లేదంటే రంగుల వినాయకుడితో పర్యావరణానికి కీడు జరగనుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వల్ల నష్టమే… ఆ రంగుల వల్ల తేలికగా నీటిలో కరగవు.. ఒకవేళ కరిగినా… వాతావరణాన్ని కలుషితం చేస్తుంటాయి. అందుకే మట్టి గణనాథులను కొలుద్దాం అని పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా హెచ్ ఎం డీఏ కూడా అలానే వ్యవహరిస్తోంది.

Reporter: Sravan.B , Hyderabad, TV9 Telugu,

Also Read: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. తాళ్లతో కారుని కట్టేసిన యజమాని.. కొట్టేస్తారని కాదు.. కొట్టుకుపోకుండా..