Sircilla Floods: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. తాళ్లతో కారుని కట్టేసిన యజమాని.. కొట్టేస్తారని కాదు.. కొట్టుకుపోకుండా..
Photo Goes Viral in Social Media: తెలంగాణాలో పలు జిల్లాల్లో వర్షాలు, వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా భారీ వర్షంతో తడిచిముద్దవుతుంది. గత రాత్రి నుంచి..
Photo Goes Viral in Social Media: తెలంగాణాలో పలు జిల్లాల్లో వర్షాలు, వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా భారీ వర్షంతో తడిచిముద్దవుతుంది. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సిరిసిల్ల పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగి నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు జలమయం అయ్యాయి. వరద ఉద్ధృతికి పట్టణంలో వస్తువులు, వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు తమ తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు, వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోకుండా వాహన యజమానులు వాటిని తాళ్లతో కడుతున్నారు.
తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ కారు యజమాని తన ఇంటి ముందు కారుని తాళ్లతో కట్టేశాడు. అయితే ఈ కారుని ఇలా తాళ్లతో బంధించింది.. ఎవరైనా దొంగలు కొట్టేస్తారని కాదు.. వరద ఉధృతికి కారు కొట్టుకుపోకుండా ఉండాలని. దీంతో సిరిసిల్లాలో వరద పరిస్థితికి ఈ ఫోటో ఒక ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పట్టణంలోని వీధులు నదులను తలపిస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలోని పలు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు ఇంట్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది. పలు కాలనీలోకి వరద నీరు చేరుకుంది. మంత్రి కేటీఆర్, అధికారులు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్లాకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు బయలు దేరాయి. సహాయక చర్యల్లో పాల్గొనడానికి 25మంది సభ్యులతో కూడిన బృందాలు బయలు దేరాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బోట్లు, ఇతర సాహాయ పరికరాలతో హైదరాబాద్ నుంచి ఈ బృందాలు బయలు దేరాయి. సిరిసిల్లాలో వరద సాహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టనున్నాయి.
Also Read: Tollywood Drug Case: ఓవైపు కొనసాగుతున్న నందు విచారణ.. మరోవైపు ఈడీ ఆఫీస్‌కు చేరుకున్న కెల్విన్..