Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌ మేట్స్‌ మధ్య మొదలైన రచ్చ రంబోలా.. లోబో మొహం పగులుద్దన్న సిరి..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 07, 2021 | 5:20 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాత్రి అయ్యిందంటే చాలు తెలుగు వారు ఇప్పుడు టీవీలకే అతుక్కుపోతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ షో అంటేనే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌ మేట్స్‌ మధ్య మొదలైన రచ్చ రంబోలా.. లోబో మొహం పగులుద్దన్న సిరి..
Bigboss 5

Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాత్రి అయ్యిందంటే చాలు తెలుగు వారు ఇప్పుడు టీవీలకే అతుక్కుపోతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ షో అంటేనే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. హౌజ్‌మేట్స్‌ మధ్య జరిగే గొడవలు, అలకలు, ఏడుపులు ఇలా షో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఈసారి షో మొదలై రెండు రోజులు కూడా గడవక ముందే హౌజ్‌ మేట్స్‌ మధ్య రచ్చ రంబోలా మొదలైంది. నేడు (మంగళ వారం) ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు ఫుల్‌ డ్రామా లభించేలా కనిపిస్తోంది. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

ఈరోజు ఎపిసోడ్‌లో సిరి, లోబోల మధ్య వాగ్వాదాం తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ‘ఏయ్‌.. నీకు ప్రాబ్లమ్‌ ఉంటే నాకు చెప్పు.. వాళ్లకు వీళ్లకు చెప్పకు’ అని లోబో అనగానే సిరి మాత్రం సింపుల్‌గా ‘ఎల్లహే’ అని అంటుంది. దీనికి ఒక్కసారిగా సీరియస్‌ అయిన లోబో.. సక్కగా మాట్లాడు అని అంటాడు. దీనికి సిరి బదులిస్తూ ‘నన్ను గెలికితే ఇలాగే మాట్లాడుతాను’ అని దురుసుగా సమాధానం ఇస్తుంది. అంతటితో ఆగని లోబో.. ‘అద్దంలో మొహం చూసుకో పో’ అంటాడు. దీంతో సిరి మొహం గురించి మాట్లాడితే మొహం పగిలి పోద్ది అని బదులిస్తుంది. వీరిద్దరి మధ్య డైలాగ్‌ వార్స్‌తో ఒక్కసారిగా హౌజ్‌లో సీరియస్‌ వాతావరణం అల్లుకుంది.

ఇక ఈ రోజు హౌజ్‌లో కాజల్‌, లహరిలకు మధ్య వాగ్వాదం జరగనుంది. ‘కాజల్‌ ఎందుకు హైపర్‌గా మాట్లాడుతున్నావు.. కంటెంట్‌ను కావాలని క్రియేట్‌ చేయకు’ అంటూ లహరి అనగానే.. భావోద్వేగానికి గురైన కాజల్‌ కంటతడి పెట్టుతుంది. తన కూతురు చూస్తే ఏడుస్తుంది అంటూ కన్నీరు తుడుచుకుంటుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఈరోజు ఎపిసోడ్‌ అంతా రచ్చ రంబోలా అయ్యేలా కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ లేటెస్ట్‌ ప్రోమోను మీరూ ఓసారి చూసేయండి.

Also Read: Gutta Jwala: గుత్తా జ్వాల వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూశారా.? వైఫ్‌ బర్త్‌డే కానుకగా..

Sehwag-Pawan Kalyan: సెహ్వాగ్‌ నోట పవన్‌ కళ్యాణ్‌ మాట.. కొత్త ట్యాలెంట్‌ చూపిస్తోన్న ఒకప్పటి స్టార్‌ క్రికెటర్‌.

Viral Photo: స్కూల్ డ్రెస్‌లో ఫోటోకు ఫోజిచ్చిన ఈ బుడ్డోడు ఇప్పుడొక స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu