Team India: 28 ఏళ్లకు భారత జట్టులోకి వచ్చి.. 4 టెస్టులతో కెరీర్ ముగించాడు.. ఎవరో తెలుసా?

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Sep 07, 2021 | 10:08 PM

Cricket News: ఒకప్పుడు భారత క్రికెటర్లకు ఓ సమస్య ఉండేది. చాలామంది ఆటగాళ్లు స్వదేశీ పిచ్‌లపై దుమ్ములేపుతారు. విదేశీ పర్యటనల్లో మాత్రం తేలిపోయేవారు...

Team India: 28 ఏళ్లకు భారత జట్టులోకి వచ్చి.. 4 టెస్టులతో కెరీర్ ముగించాడు.. ఎవరో తెలుసా?
Cricketer

Follow us on

90వ దశకంలో టీమిండియా క్రికెటర్లు తమ ఫామ్ లేమితో సతమతమయ్యేవారు. చాలామంది ఆటగాళ్లు స్వదేశీ పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తూ.. విదేశీ పర్యటనల్లో విఫలమయ్యేవారు. దానితో వారిపై వేటుపడేది. ఆ టైంలో ఇలా విదేశాలలో వైఫల్యం అయిన కారణంగా సుదీర్ఘ కెరీర్‌కు దూరమైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. అలాంటివారిలో ఒకరు దేవాంగ్ గాంధీ. ఈ ఆటగాడు దేశీయ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించాడు. తద్వారా టీమిండియా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన కారణంగా కెరీర్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది. ఇవాళ దేవాంగ్ గాంధీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం పదండి..

ఎన్నో అంచనాల నడుమ భారత జాతీయ జట్టుకు దేవాంగ్ గాంధీ ఎంపికయ్యాడు. తన మొదటి రెండు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా ఓ టెస్టులో మరో బ్యాట్స్‌మెన్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కథంతా అడ్డం తిరిగింది. 1999-2000 మధ్య ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టులో దేవాంగ్ గాంధీకి చోటు దక్కింది. అద్భుత ప్రదర్శనలతో అదరగొడతాడని అందరూ ఊహించగా.. సీన్ రివర్స్ అయింది. పేలవ ప్రదర్శన కనబరిచాడు. దానితో అతడి కెరీర్ ముగిసింది.

1999వ సంవత్సరం అక్టోబర్‌లో న్యూజిలాండ్ సిరీస్‌లో దేవాంగ్ గాంధీ.. టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. మొహాలీలో జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో దేవాంగ్ గాంధీ డకౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. సహాచర ఆటగాడు సదాగోపన్ రమేష్‌తో కలిసి 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 242 బంతుల్లో 75 పరుగులు చేశాడు. దీనితో ఆ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది.

ఇక ఆ తర్వాత కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో దేవాంగ్ గాంధీ మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శనల దృష్ట్యా దేవాంగ్ గాంధీ 1999–2000 మధ్య ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అదే దేవాంగ్‌కు కెరీర్‌లో చివరి పర్యటన అయింది. ఆ సిరీస్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన దేవాంగ్.. కేవలం నాలుగు పరుగులు మాత్రం చేయగలిగాడు. అలాగే రెండు వన్డేలు ఆడిన అతడు 13 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లపై దేవాంగ్ పూర్తిగా విఫలమయ్యాడు. దీనితో సెలెక్టర్లు అతడిపై వేటు వేశారు. మళ్లీ జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. దేవాంగ్ తన కెరీర్‌లో మొత్తం 204 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

కాగా, దేశవాళీ క్రికెట్‌లో దేవాంగ్ గాంధీ ప్రదర్శనను పరిశీలిస్తే, అతడు బెంగాల్ తరపున 95 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 42.73 సగటుతో 6111 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో అదరగొట్టాడు. అదే సమయంలో, 98 లిస్టు-A మ్యాచ్‌లలో 9 సెంచరీలు, 16 అర్ధ సెంచరీలతో 3402 పరుగులు చేశాడు.

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..

 పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu