Virat kohli-Ravi Shastri: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకో తెలుసా?

IND vs ENG: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనందుకు వీరిని ప్రశ్నించనుంది.

Virat kohli-Ravi Shastri: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకో తెలుసా?
Ravi Shastri And Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Sep 07, 2021 | 12:04 PM

Virat kohli-Ravi Shastri: ఓవల్ విజయంతో టీమిండియా సంతోషంగా ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం చాలా కోపంగా ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి వైఖరిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, భారత క్రికెట్ బోర్డులోని మూలాలను పరిశీలిస్తే.. గతవారం లండన్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి విరాట్ కోహ్లీతో కలిసి రవిశాస్త్రి కూడా హాజరు అయ్యారంట. దీంతో ఈ విషయంపై బీసీసీఐ వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం, టీమిండియా కోచ్ శాస్త్రి, కెప్టెన్ కోహ్లీతోపాటు ఇతర సభ్యులు ఓ పుస్తకావిష్కరణకు హాజరయ్యేందుకు వెళ్లారని, అక్కడ హాల్ మొత్తం జనంతో నిండిపోయిందని సమాచారం.

ఈ కార్యక్రమానికి హాజరైన 5 రోజుల తర్వాత ఆదివారం రవిశాస్త్రికి కరోనా పరీక్ష పాజిటివ్‌గా తేలింది. ఆయన సన్నిహితంగా ఉన్నందున బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఈ నలుగురిని ఐసోలేషన్‌ ఉంచినట్లు తెలుస్తోంది.

ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతివ్వలేదు.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రవిశాస్త్రితోపాటు విరాట్ కోహ్లీకి బోర్డు అనుమతించలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఓ అధికారి మాట్లాడుతూ.. “బోర్డ్ ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను అందుకుంది. ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డు సిగ్గుపడేలా చేశారు. ఈ విషయంపై బోర్డు రవిశాస్త్రితోపాటు విరాట్ కోహ్లీని ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీష్ డోంగ్రే పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఈసీబీ కూడా అనుమతివ్వలేదు.. బ్రిటిష్ మీడియా నివేదిక ప్రకారం, “ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి భారత జట్టు సభ్యులను అనుమతించలేదు.” ఈ మొత్తం సమస్యపై బీసీసీఐ ప్రస్తుతం ఈసీబీని సంప్రదిస్తోంది. సాఫీగా సిరీస్‌ను ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మేమంతా రవిశాస్త్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని బీసీసీఐ అధికారి తెలిపారు. బుధవారం టీ 20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసే సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: తొలి వన్డేలో అమెరికా ఘన విజయం.. కేవలం 28 ఓవర్లలోనే ఫలితం.. ఈ భారత స్పిన్నరే కారణం.. ఆయనెవరో తెలుసా?

Virat Kohli-Ashwin: అశ్విన్‌ను అందుకే పక్కన పెట్టాం..! అసలు విషయం చెప్పిన టీమిండియా కెప్టెన్

IND vs ENG: ఓవల్ టెస్టులో నిజమైన హీరో నేను కాదు..! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?