IND vs ENG: ఓవల్ టెస్టులో నిజమైన హీరో నేను కాదు..! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

ఓవల్‌లో భారత్ భారీ విజయం సాధించింది. ఇదో టీం గేమ్ అనేందుకు టీమిండియానే చక్కని ఉదాహరణ. భారత్ 157 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

IND vs ENG: ఓవల్ టెస్టులో నిజమైన హీరో నేను కాదు..! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?
Rohit
Follow us
Venkata Chari

|

Updated on: Sep 07, 2021 | 9:03 AM

Rohit Sharma: ఓవల్ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఇది మాములు విజయం కాదు.. ఏకంగా 157 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయం చారిత్రాత్మకమైనది. టీమిండియాకు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత్ ఓవల్‌లో గత 50 సంవత్సరాల తర్వాత ఈ మైదానంలో విజయం సాధించింది. ఓవల్‌లో టీమిండియా విజయం.. గబ్బాలో ఆస్ట్రేలియా అహంకారాన్ని బద్దలు కొట్టినట్లే.. ఇక్కడ కూడా ఇంగ్లండ్ అహం మీద దెబ్బతీసింది. రెండు చోట్లా భారత జట్టు చరిత్రను మార్చింది. ఓవల్‌ను ఘన విజయం సాధించిన తరువాత.. నిజమైన హీరో ఎవరంటూ అన్వేషణ ప్రారంభమైంది. క్రికెట్ అనేది టీమ్ గేమ్. ఓవల్‌లో భారత్ భారీ విజయం దీనికి అతిపెద్ద ఉదాహరణగా మారింది. అయితే, ఓవల్ టెస్ట్ అనంతరం క్రికెట్ పండితులు రోహిత్ శర్మను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంచుకున్నారు.

రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగుల సాటిలేని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించేందుకు సహాయపడింది. విదేశీ మైదానంలో రోహిత్ బ్యాట్ నుంచి ఇది తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో, రోహిత్, పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 153 పరుగులు జోడించాడు. దీంతోనే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం సాధించే దిశగా సాగింది. మొత్తంమీద, ఓవల్ టెస్ట్‌లో నిజమైన హీరోగా రోహిత్ శర్మను ఎంపిక చేసుకోవడానికి కారణం ఇదే.

రోహిత్ మాత్రం ఎవరు పేరు చెప్పాడంటే.. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించినప్పుడు, ఓ విషయాన్ని చెప్పాడు. నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు నిజమైన అర్హుడు శార్దుల్ ఠాకూర్. ఓవల్‌లో భారత విజయానికి నిజమైన హీరో అతనే అంటూ కుండ బద్దలు కొట్టాడు. రోహిత్ మాట్లాడుతూ, “నేను ఈ టైటిల్‌కు అర్హుడిని కాను. ఓవల్ టెస్టులో నిజమైన హీరో అంటే శార్దూల్ ఠాకూర్. నా అభిప్రాయం ప్రకారం, శార్దుల్ ఠాకూర్ ఈ బిరుదుకు అర్హుడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

శార్దూల్‌కే ఎందుకు ఇవ్వాలి? శార్దూల్ ఠాకూర్ కచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు అర్హుడే. శార్దూల్ రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 36 బంతుల్లో 57 పరుగుల వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. దీంతోనే టీమిండియా అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అయ్యే ప్రమాదాన్నుంచి తప్పించుకుంది. అలాగే రెండవ ఇన్నింగ్స్‌లో 72 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. ఇక బంతితో 3 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 1 వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. దీంతో శార్దూల్ టెస్ట్ క్రికెట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఓవల్ టెస్టులో శార్దూల్ ఆల్ రౌండ్ గేమ్ కనిపించింది. దీని కారణంగానే రోహిత్ శర్మ కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిజమైన అర్హుడిగా శార్దుల్ పేరును ప్రస్తావించాడు.

Also Read:

ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ టీంలో ఈ 14 మంది ఆటగాళ్లు ఫిక్స్..? మిగతా స్థానాల కోసం తీవ్రమైన పోటీ

IND vs ENG: ఓవల్‌లో త్రివర్ణ పతాకం ఎగిరింది.. భారత ఖాతాలో 6 రికార్డులను చేర్చిన కోహ్లీసేన.. అవేంటో తెలుసా?

India Vs England 2021: 24 టెస్టుల్లో 100 వికెట్లతో రికార్డు.. ఓవర్సీస్‌ బౌలర్‌గా పేరు.. కపిల్ దేవ్‌ను వెనక్కు నెట్టిన భారత స్పీడ్‌స్టర్