Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli-Ashwin: అశ్విన్‌ను అందుకే పక్కన పెట్టాం..! అసలు విషయం చెప్పిన టీమిండియా కెప్టెన్

IND vs ENG: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆడేందుకు రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడంపై చాలా మంది నిపుణులు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యంతోపాటు అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు.

Virat Kohli-Ashwin: అశ్విన్‌ను అందుకే పక్కన పెట్టాం..! అసలు విషయం చెప్పిన టీమిండియా కెప్టెన్
Ashwin Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Sep 07, 2021 | 9:09 AM

Virat Kohli-Ashwin: భారత్- ఇంగ్లండ్ టీంల మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుకోలేకపోయాడు. అయితే ఈ నిర్ణయంపై చాలా మంది నిపుణులు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యంతోపాటు అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. వీరిలో మాజీ ఇంగ్లండ్ క్రికెటర్లతోపాటు భారత మాజీలు కూడా ఉన్నారు. మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్నర్లకు సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిలో, అశ్విన్ లేకపోవడం వల్ల టీమిండియా తగిన నష్టాన్ని భరించాల్సి రావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ, అశ్విన్ లేకుండానే నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. అది కూడా చాలా తేలికగా. మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్‌ను తీసుకోకపోవడంపై ఓ ప్రశ్నకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సమాధానమిచ్చాడు. జట్టు ఐక్యంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బయట ఏమి జరుగుతుందో పట్టించుకోమని తెలిపారు.

మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో, అశ్విన్‌ను బెంచ్‌లో ఉంచాలనే నిర్ణయం సరైనదేనా అంటూ కోహ్లీని ఓ ప్రశ్న అడిగారు. దీనిపై కోహ్లీ తన వైఖరిని స్పష్టం చేశాడు. ‘మేము ఎప్పుడూ విశ్లేషణ, గణాంకాలు లేదా సంఖ్యల వైపు ఆలోచించం. ఎక్కడ దృష్టి పెట్టాలో మాకు తెలుసు. జట్టుగా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. దీనిపై జరిగే ‎ఆందోళనలను మేం పట్టించుకోం. ఓవల్ టెస్ట్ ప్రారంభానికి ముందు, ఇక్కడ స్లో పిచ్ ప్రకారం, అశ్విన్‌కు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంగ్లండ్ జట్టులో నలుగురు ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ ఉన్నారు. అందుకే అశ్విన్ స్థానంలో మార్పు చేశాం’ అంటే కోహ్లీ వివరించారు.

కోహ్లీకి జడేజాపై ఎక్కువ నమ్మకం.. టాస్ సమయంలో, కోహ్లీ తాను నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో (రవీంద్ర జడేజా) బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు. జడేజా ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌లకు తిరుగులేన అస్త్రంగా పనిచేస్తాడని, వారిని ముప్పు తిప్పలు పెడతాడనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే చివరి రోజు విరాట్ కోహ్లీ మాటలు సరైనవని తేలింది. జడేజాకు కేవలం రెండు వికెట్లు మాత్రమే లభించాయి. అతను హసీబ్ హమీద్, మొయిన్ అలీ వికెట్లను పడగొట్టాడు. కానీ, కఠినమైన బౌలింగ్ కారణంగా, బంతి త్వరగా పాతబడింది. ఇది రివర్స్ స్వింగ్ సాధించడానికి భారత బౌలర్లకు సహాయపడింది. జడేజా బ్యాటింగ్ సామర్థ్యం కారణంగా కోహ్లీ అతనిపై విశ్వాసం వ్యక్తం ఉంచాడు. ఓవల్‌లో జడేజా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. కానీ, నాటింగ్‌హామ్, లార్డ్స్‌లో అతను బాగా బ్యాటింగ్ చేశాడు. దీంతోనే జడేజాకు అవకాశం అందించాడు.

Also Read:

IND vs ENG: ఓవల్ టెస్టులో నిజమైన హీరో నేను కాదు..! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ టీంలో ఈ 14 మంది ఆటగాళ్లు ఫిక్స్..? మిగతా స్థానాల కోసం తీవ్రమైన పోటీ

IND vs ENG: ఓవల్‌లో త్రివర్ణ పతాకం ఎగిరింది.. భారత ఖాతాలో 6 రికార్డులను చేర్చిన కోహ్లీసేన.. అవేంటో తెలుసా?