India Vs England 2021: 24 టెస్టుల్లో 100 వికెట్లతో రికార్డు.. ఓవర్సీస్‌ బౌలర్‌గా పేరు.. కపిల్ దేవ్‌ను వెనక్కు నెట్టిన భారత స్పీడ్‌స్టర్

Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్భుత విజయాన్ని సాధించాడు. 2018 లో టెస్ట్ అరంగేట్రం చేసిన తరువాత, టీమిండియాలో నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడు.

India Vs England 2021: 24 టెస్టుల్లో 100 వికెట్లతో రికార్డు.. ఓవర్సీస్‌ బౌలర్‌గా పేరు.. కపిల్ దేవ్‌ను వెనక్కు నెట్టిన భారత స్పీడ్‌స్టర్
Jasprit Bumrah
Follow us
Venkata Chari

|

Updated on: Sep 07, 2021 | 7:13 AM

Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ టెస్టులో అతను 100 వికెట్లు పూర్తి చేశాడు. ఒల్లీ పోప్ అతని 100 వ టెస్ట్ బాధితుడిగా మారాడు. జస్ప్రీత్ బుమ్రా 24 వ టెస్టులో పలు అద్భుతాలు నెలకొల్పాడు. భారత్ తరపున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా మారాడు. 25 టెస్టుల్లో 100 వికెట్లు తీసిన కపిల్ దేవ్‌ను కూడా వెనక్కు నెట్టాడు. మొత్తంగా వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన ఎనిమిదవ భారతీయుడుగా నిలిచాడు. 18 టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ ముందు వరుసలో ఉన్నాడు.

భారత్ తరఫున వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన బౌలర్లలో, స్పిన్నర్లు మొదటి ఏడు స్థానాల్లో ఉండడం విశేషం. అశ్విన్ తర్వాత ఎరపల్లి ప్రసన్న (20 టెస్టులు), అనిల్ కుంబ్లే (21 టెస్టులు), భగవత్ చంద్రశేఖర్ (22 టెస్టులు), సుభాష్ గుప్తే (22 టెస్టులు), ప్రగ్యాన్ ఓజా (22 టెస్టులు), వినూ మంకద్ (23 టెస్టులు), రవీంద్ర జడేజా (24 టెస్టులు) బుమ్రా కంటే ముందు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా 2018 సంవత్సరంలో తన తొలి టెస్టు ఆడాడు. అప్పటి నుంచి తన ఫాస్ట్ బౌలింగ్‌తో పలు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అతను టెస్టుల్లో భారత నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ కూడా సాధించాడు.

ఓవర్సీస్‌లో 96..భారత్‌లో 4 వికెట్లు  బుమ్రా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా టీంలపై 100 టెస్టు వికెట్లలో 96 వీటిపైనే పడగొట్టాడు. ఆస్ట్రేలియాలో 32, ఇంగ్లండ్‌లో 32, దక్షిణాఫ్రికాలో 14, వెస్టిండీస్‌లో 13, న్యూజిలాండ్‌లో ఆరు వికెట్లు ఉన్నాయి. భారతదేశంలో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లలో అతని పేరుపై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. 27 ఏళ్ల బుమ్రా జనవరి 2018 లో దక్షిణాఫ్రికాతో తన తొలి టెస్టు ఆడాడు. తన మొదటి వికెట్‌గా ఏబీ డివిలియర్స్‌ని బౌల్డ్ చేశాడు. తాజా టెస్టులో 100 వ వికెట్ కూడా బౌల్డ్ ద్వారానే వచ్చింది. ఈసారి ఒల్లీ పోప్ బౌల్డ్ అయ్యాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో బుమ్రా అత్యంత విజయవంతమైన బౌలర్. అతను నాలుగు టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఒల్లీ రాబిన్సన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో వ్యక్తి అతను. రాబిన్సన్ 21 వికెట్లు తీశాడు.

Also Read: IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కోహ్లీ సేన..!

ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ రేసులో భారత స్టార్ బౌలర్, ఇంగ్లండ్ కెప్టెన్

Viral Video: ‘కాశ్మీరీ పులావ్’లో కాశ్మీర్ ఉంటుందా.. ప్రశ్నించిన చాహల్‌ భార్య..! ఎందుకో తెలుసా?